అన్న కొన‌లేదు.. అప్పు క‌ట్ట‌లేన‌ని చేతులెత్తేసిన అంబానీ!

అన్న కొన‌లేదు.. అప్పు క‌ట్ట‌లేన‌ని చేతులెత్తేసిన అంబానీ!

ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త అనిల్ అంబానీ క‌ష్టాలు రోజురోజుకు రెట్టింప‌వుతున్నాయి. రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్స్ అప్పులు క‌ట్ట‌లేక ఇప్ప‌టికే దివాలా పిటిష‌న్ దాఖ‌లు చేసిన ఆయ‌న‌కు అన్న ముకేశ్ అంబానీ భారీ షాక్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. ఆర్‌-కామ్ ఆస్తుల విక్ర‌యానికి సంబంధించి ముకేశ్ తో రూ.23 వేల కోట్ల‌కు కుదుర్చుకున్న ఒప్పందం విఫ‌ల‌మ‌య్యింద‌ని సుప్రీంకోర్టుకు అనిల్ తాజాగా నివేదించారు. ఇక తాను ఎవ‌రికీ అప్పులు చెల్లించే ప‌రిస్థితిలో లేన‌ని చేతులెత్తేశారు.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్‌-కామ్ నుంచి ఆస్తులు కొనుగోలు చేసేందుకు అన్న ముకేశ్ తో రూ.23 వేల కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు తండ్రి ధీరూభాయ్ అంబానీ 85వ జ‌యంతి నాటు అనిల్ ప్ర‌క‌టించారు. రుణాలు చెల్లించ‌లేక ఉక్కిరిబిక్కిర‌వుతున్న అనిల్ కు ఈ ఒప్పందం సంజీవ‌నిలా క‌నిపించింది. జియోను పూర్తిస్థాయిలో విస్త‌రించ‌డానికి ఆర్‌-కామ్ ఆస్తులు ముకేశ్ కు కూడా దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని అంతా భావించారు.

అయితే - స్వీడన్ టెలికాం కంపెనీ ఎరిక్స‌న్ కు రూ.550 కోట్లు చెల్లించాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల‌ను పాటించ‌లేక‌పోయిన అంబానీ మంగ‌ళ‌వారం కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌ర‌ఫు సీనియ‌ర్‌ న్యాయ‌వాదులు ముకుల్ రోహ‌త్గీ, క‌పిల్ సిబ‌ల్‌ షాకింగ్ విష‌యాల‌ను వెల్ల‌డించారు. అనిల్ ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ ముకేశ్ తో రూ.23 వేల కోట్ల ఒప్పందం ప‌ట్టాలెక్క‌లేద‌ని తెలిపారు. అందువ‌ల్ల ఇక ఆయ‌న అప్పులు చెల్లించలేర‌ని స్ప‌ష్టం చేశారు. వాద‌న‌లు జ‌రుగుతున్నంత‌సేపూ అనిల్ కోర్టు హాలులో నిల్చొని ఉండ‌టం గ‌మ‌నార్హం

రూ.47 వేల కోట్ల రుణాలు చెల్లించ‌లేక ఆర్‌-కామ్ ఈ నెల 1న దివాలా పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ నేప‌థ్యంలో సంస్థ ఆస్తుల కొనుగోలుపై ముకేశ్ వెన‌క్కి త‌గ్గిన‌ట్లు స‌మాచారం. నిజానికి ఈ ఒప్పందానికి ముకేశ్ గ‌తంలో అంగీక‌రించారు. అయితే ఆర్‌-కామ్ గ‌త అప్పులు, స్పెక్ట్ర‌మ్ వాడ‌కంపై కేంద్రానికి చెల్లించాల్సిన రుసుములు ఎవ‌రు చెల్లించాల‌నే దానిపై స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతో ఆయ‌న వెన‌క్కి త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. త‌మ అప్పు చెల్లించేంత వ‌ర‌కు అనిల్ ను జైల్లో పెట్టాల‌ని ఎరిక్స‌న్ సంస్థ సుప్రీంకోర్టును కోరింది. ముకేశ్ ఆర్‌-కామ్ ఆస్తులు కొంటేనే అప్పు చెల్లిస్తాన‌ని త‌మ‌కుగానీ, కోర్టుకుగానీ గ‌తంలో అనిల్ చెప్ప‌లేద‌ని గుర్తుచేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English