టీ సెక్ర‌టేరియ‌ట్లో క‌ల‌క‌లం.. ఏసీబీ రెడ్‌హ్యాండెడ్ అరెస్ట్‌

టీ సెక్ర‌టేరియ‌ట్లో క‌ల‌క‌లం.. ఏసీబీ రెడ్‌హ్యాండెడ్ అరెస్ట్‌

లంచ‌గొండుల అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సంద‌ర్భం ఏదైనా త‌మ‌కు చేతులు త‌డ‌ప‌నిదే ప‌ని కానివ్వని కొంద‌రు అధికారుల మూలంగా సామాన్యులు తీవ్ర ఇక్క‌ట్లు ఎదుర్కుంటున్నారు. అలా అనేక అవ‌స్థ‌లు ప‌డిన ఓ మ‌హిళ ధైర్యంగా ముందుకు వ‌చ్చింది. అవినీతి జ‌ల‌గ‌ను ప‌ట్టించింది. స‌ద‌రు జ‌ల‌గ ఏకంగా స‌చివాల‌యంలో ప‌నిచేస్తున్న వ్య‌క్తి కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. తెలంగాణ స‌చివాల‌య ఉద్యోగి ఇలా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది.

వివ‌రాల్లోకి వెళితే.... ఖమ్మం జిల్లా వాసి నాగలక్ష్మిత‌న భర్త చనిపోవడంతో కారుణ్య నియామకం కోటాలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. నాగలక్ష్మి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, అందుకు ₹ 1.20 లక్షలు ఇవ్వాలని  సచివాలయంలో పని చేస్తున్న పంచాయతీరాజ్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ నాగరాజు డిమాండ్‌ చేశాడు. త‌ను అంత మొత్తం ఇచ్చుకోలేన‌ని ఆమె ప్రాదేయ‌ప‌డిన‌ప్ప‌టికీ ఆయ‌న క‌రుణించ‌లేదు. దీంతో ఎంజీబీఎస్ బ‌స్టాండ్‌లో సొమ్ములు అందిస్తానని నాగ‌ల‌క్ష్మి తెలిపింది. ఎంజీబీఎస్‌ దగ్గర నాగ‌ల‌క్ష్మి నుంచి ₹ 60 వేలు లంచం తీసుకుంటుండగా నాగరాజును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అధికారిని పట్టుకునేందుకు పక్కా ప్రణాళిక వేసిన‌ ఏసీబీ ఇలా స‌చివాల‌య ఉద్యోగిని అరెస్ట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English