స్విగ్గిస్టోర్స్‌..మీకు కావాల్సిన‌వ‌న్నీ ఇంటికే...

స్విగ్గిస్టోర్స్‌..మీకు కావాల్సిన‌వ‌న్నీ ఇంటికే...

ఇటీవ‌లి మధ్యకాలంలో ఆన్‌లైన్‌లో ఆర్డరు చేసి ఆహార పదార్థాలు ఇంటికే లేదా ఉన్నచోటుకే తెప్పించుకోవడం బాగా ఊపందుకుంది. ఇంట్లో వండుకోలేక, దంపతులు తీరిక లేక ఆన్‌లైన్ ఆర్డర్లతో ఆకలి తీర్చుకుంటున్నారు. ఫుడ్‌పాండా, జొమాటో, స్విగ్గీ, ఊబర్ ఈట్స్, టిన్‌మెన్ వంటి ఆన్‌లైన్ కంపెనీలు జోరుగా వ్యాపారం సాగిస్తున్నాయి. రోడ్లమీద ఎక్కడ చూసినా డెలివరీ బాయ్స్ ఫుడ్‌బాక్సులతో రయ్యిరయ్యిమని తిరగడం సాధారణ దృశ్యమైపోయింది. ఇందులో ప్ర‌ముఖ ఫుడ్ డెలివ‌రీ యాప్ స్విగ్గీ త‌న ముద్ర‌ను చాటుకుంది. అయితే,ఇప్ప‌టివ‌ర‌కు వ‌డ్డించిన వాటికి భిన్ంన‌గా స్విగ్గి త‌న సేవ‌లు అందించ‌నుంది.

స్విగ్గీ ఇక‌పై క‌స్ట‌మ‌ర్ల‌కు కిరాణా స‌రుకుల‌ను కూడా డెలివ‌రీ చేయ‌నుంది. ఈ మేర‌కు స్విగ్గీ ఇవాళ స్విగ్గీ స్టోర్స్‌ను ప్రారంభించింది. ఈ యాప్‌లోకి యూజ‌ర్లు లాగిన్ అయి త‌మ ఇంటి నుంచే త‌మ‌కు కావ‌ల్సిన నిత్యావ‌స‌రాలు, ఇత‌ర కిరాణా స‌రుకుల‌ను ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు. త‌మ సిటీలో ఉన్న పాపుల‌ర్ స్టోర్స్ నుంచి క‌స్ట‌మ‌ర్లు త‌మ‌కు కావ‌ల్సిన స‌రుకులను తెప్పించుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఆయా సిటీల్లో ఉన్న పాపుల‌ర్ స్టోర్స్‌తో స్విగ్గీ భాగ‌స్వామ్యం అయింది. ఇక స్విగ్గీ స్టోర్స్ సేవ‌లు ప్ర‌స్తుతానికి గుర్గావ్‌లోనే ప్రారంభ‌మ‌వ‌గా త్వర‌లో దేశంలోని ప‌లు ఇతర న‌గ‌రాలు, ప‌ట్టణాల్లోనూ ఈ సేవ‌ల‌ను ప్రారంభించ‌నున్నారు. ఆయా సిటీల్లో ఉన్న కిరాణా షాపులు, సూప‌ర్ మార్కెట్లు, పాన్ షాపులు, పెట్ కేర్ స్టోర్స్‌, ఫ్లోరిస్ట్స్‌, బేబీ కేర్ స్టోర్స్‌, ఆర్గానిక్ స్టోర్స్‌లో ల‌భించే వ‌స్తువుల‌ను స్విగ్గీ క‌స్ట‌మ‌ర్లు ఆర్డ‌ర్ చేసి పొంద‌వచ్చని సంస్థ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English