ఒకే చోటుకు రాకేశ్, శిఖా...జ‌య‌రాం కేసు తేలిన‌ట్లే

ఒకే చోటుకు రాకేశ్, శిఖా...జ‌య‌రాం కేసు తేలిన‌ట్లే

పారిశ్రామిక‌వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు చిక్కుముళ్లు విప్పేందుకు పోలీసులు క‌స‌రత్తు చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తును జూబ్లీహిల్స్ పోలీసులు ముమ్మరం చేశారు. తన మేనమామ జయరాం హత్య కేసుతో తనకెలాంటి సంబంధం లేదని శిఖా చౌదరి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జయరాం హత్య కేసులో శిఖా చౌదరిని విచారించాల‌ని నిర్ణ‌యించారు. కృష్ణా జిల్లా పోలీసులు అరెస్టు చేసిన రాకేశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ను నందిగామ కోర్టు అనుమతితో సోమవారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. నిందితులను వారం రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌.. ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

ఇదిలాఉండ‌గా, జూబ్లీహిల్స్‌లోని జయరాం తన ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తర్వాత నందిగామలో మృతదేహాన్ని గుర్తించే వరకు దాదాపు 31 గంటల సమయంలో ఏం జరిగిందని ఆరా తీయనున్నారు పోలీసులు. ఈ సమయం కేసులో కీలకంగా మారనుంది. జయరాం భార్య పద్మశ్రీ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే పలు వివరాలు సేకరించారు. మరో బృందం...కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్‌చేసిన రాకేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌ను నందిగామ కోర్టు అనుమతితో సోమవారం హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరుచగా 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను వారంరోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని దాఖలైన పిటిషన్.. మంగళవారం కోర్టులో విచారణకు వచ్చే అవకాశముంది.

జయరాం హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిఖాచౌదరిని జూబ్లీహిల్స్ పోలీసులు విచారించే అవకాశాలున్నాయి. రాకేశ్‌రెడ్డి, శిఖాచౌదరి, జయరాం మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో కేసును ఛేదించే దిశగా అడుగులు వేస్తున్నారు. నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకున్న తరువాత సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నారు. కస్టడీలో రాకేశ్‌రెడ్డి, శిఖాచౌదరిని ముఖాముఖిగా కూర్చోబెట్టి మరింత సమాచారాన్ని సేకరించే అవకాశాలున్నాయి. ఈ ముఖాముఖి ద్వారా కేసు పూర్తి స్ప‌ష్ట‌త రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English