నో డౌట్‌.. ఏపీ బీజేపీ నేత‌లు ఆంధ్రోళ్లు కాదు!

నో డౌట్‌.. ఏపీ బీజేపీ నేత‌లు ఆంధ్రోళ్లు కాదు!

విభ‌జ‌న‌తో దారుణంగా న‌ష్ట‌పోయిన ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తానంటూ నాడు ప్ర‌ధాని హోదాలో ఉన్న మ‌న్మోహ‌న్ సింగ్ రాజ్య‌స‌భ‌లో హామీ ఇవ్వ‌టం ప్ర‌తి ఒక్క‌రికి గుర్తున్న‌దే. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ ఏపీకి ప్ర‌చారానికి వ‌చ్చిన మోడీతో పాటు ప‌లువురు బీజేపీ నేత‌లు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌న్న హామీ ఇచ్చి వెళ్లారు. కానీ.. ప‌వ‌ర్లోకి వ‌చ్చాక మోడీ తీరు ఎలా మారిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

ఇదిలా ఉంటే.. మోడీ తీరును త‌ప్పు ప‌డుతూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఢిల్లీలో చేసిన దీక్షకు అన్ని వ‌ర్గాల నుంచి సానుకూల స్పంద‌న రావ‌టం ఒక ఎత్తు అయితే.. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో వ‌చ్చిన కొంద‌రి ఎంట్రీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ దీక్ష‌కు దేవ‌గౌడ‌.. రాహుల్ గాంధీ రావ‌టం.. కే్జ్రీవాల్ రావ‌టం.. ఫ‌రూఖ్ అబ్దుల్లాలు రావ‌టం ఒక ఎత్తు అయితే.. బీజేపీకి జానీ జిగిరి దోస్త్ అయిన శివ‌సేన రావ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తే.. ప‌క్క‌నున్న రాష్ట్రాలు ఒప్పుకోవ‌న్న మాట‌లో ఎలాంటి నిజం లేద‌న్న విష‌యం దేవెగౌడ‌.. శివ‌సేన నేత‌ల ఎంట్రీలు స్ప‌ష్టం చేశాయ‌ని చెప్పాలి.

మోడీ అంటే మండిప‌డే శివ‌సేన‌.. ఇప్ప‌టికి బీజేపీ మిత్ర‌ప‌క్షంగా వ్య‌హ‌రిస్తున్న శివ‌సేన హోదా కోసం బాబు చేస్తున్న దీక్ష‌కు త‌ర‌లి రావ‌టం చూస్తే.. మోడీ స‌ర్కారు తీరును త‌ప్పు ప‌ట్టిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. అంతేకాదు.. స్వ‌యాన బీజేపీకి చెందిన సీనియ‌ర్ నేత‌.. ఎంపీ క‌మ్ సినీ న‌టుడు శ‌త్రుఘ్న సిన్హా స్వ‌యంగా రావ‌టం చూసిన‌ప్పుడు హోదాకు ఆయ‌న ఎంత స‌పోర్ట్ ప‌లుకుతున్నారో అర్థ‌మ‌వుతుంది.

ఇదంతా చూసిన‌ప్పుడు ఏపీ బీజేపీ నేత‌లు అప్ర‌య‌త్నంగా గుర్తుకు రాక మాన‌రు. ఎక్క‌డో ఉండి.. ఆంధ్రాతో నేరుగా సంబందాలు లేన‌ప్ప‌టికీ..విభ‌జ‌న‌కార‌ణంగా జ‌రిగిన న‌ష్టాన్ని ప్ర‌త్యేక హోదాతో భ‌ర్తీ చేయొచ్చ‌న్న మాట‌కు అండ‌గా నిలుస్తుంటే.. ఏపీకి చెందిన ఆంధ్రా క‌మ‌ల‌నాథులు మోడీకి వంగి వంగి న‌మ‌స్కారాలు పెడుతున్న వైనంతో ఒళ్లు మండ‌క మాన‌దు.

పుట్టిన గ‌డ్డ‌కు మేలు చేసేలా ప్ర‌య‌త్నాలు చేయాల్సిన నేత‌లు.. అధినేత మీద ఉన్న భ‌క్తి.. భ‌యంతో క‌న్న‌త‌ల్లి లాంటి రాష్ట్రానికి న‌ష్టం వాటిల్లేలా చేస్తున్న వైనం చూస్తే.. ఏపీ బీజేపీ నేత‌ల్లో ఆంధ్రా మూలాలు ఉన్నాయా? అన్న కొత్త డౌట్ రాక మాన‌దు. రాష్ట్రానికి సంబంధం లేని వారు సైతం హోదా దీక్ష‌కు అండ‌గా నిలుస్తున్న వేళ‌.. అందుకు భిన్నంగా ఏపీ క‌మ‌ల‌నాథుల తీరు చూస్తే.. మాతృభూమికి ద్రోహం చేసిన వారిగా క‌నిపిస్తున్నార‌న్న మాట ప‌లువురి  నోట వినిపిస్తూ ఉండ‌టం గ‌మనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English