మోడీ,షా రూ.వెయ్యి విరాళం... !

మోడీ,షా రూ.వెయ్యి విరాళం... !

రాజకీయ పార్టీల‌కు ఆయువుప‌ట్టు అయిన విరాళాల విష‌యంలో...భారతీయ జనతా పార్టీ పెద్ద‌లు కొత్త ఒర‌వ‌డికి శ్రీ‌కారం చుట్టారు. బీజేపీకి ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ రూ.వెయ్యి విరాళం ఇచ్చారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో కలిసి పార్టీ యాప్ ద్వారా రూ.వెయ్యి విరాళాన్ని అమిత్‌షా అందజేశారు. ఇంత‌క కీల‌క‌మైన స్థాయిలో ఉన్న నేత‌లు ఈ స్థాయిలో విరాళం ఇవ్వ‌డం ఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? ఇంత తక్కువ విరాళం ఇవ్వడం ద్వారా వాళ్లు ఓ సందేశాన్ని కూడా పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు. పార్టీని నడిపించడానికి బడా వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, నల్లధనంపై ఆధారపడే పరిస్థితి పోవాలని, విరాళాల్లో ఓ పారదర్శకత రావాలని అమిత్ షా పిలుపునిచ్చారు.

దీన్‌దయాల్ ఉపాధ్యాయ 51వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఓ పార్టీ కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. విరాళాల విషయంలో మిగతా పార్టీలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ``పార్టీ కార్యకర్తలంతా విరాళాలు ఇవ్వాలని కోరుతున్నా. నమో యాప్ ద్వారా సులువుగా ఈ పని చేయొచ్చు. నేను నా వంతు విరాళం ఇచ్చాను`` అని మోడీ ట్వీట్ చేశారు. మన డబ్బుతో ఈ పార్టీ నడిపిద్దాం కానీ బడా వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, బిల్డర్ల సొమ్ముతో కాదు అని అమిత్ షా అన్నారు. వీళ్ల డబ్బుతో పార్టీ నడిస్తే అప్పుడు స్వచ్ఛంగా ఉండలేదని, తన లక్ష్యాలను చేరుకోలేదని ఆయన స్పష్టంచేశారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది... కానీ ఇలా వెయ్యి వెయ్యి సంపాదించే దేశంలో అత్యంత ఖ‌రీదైన ప్ర‌క‌ట‌న క‌ర్త‌గా బీజేపీ ఎదిగిందా? అంత పొదుపు పాటించే పార్టీ దేశంలో కార్పొరేట్ కంపెనీల‌కు మించి యాడ్స్‌పై ఖ‌ర్చు పెట్టిన డ‌బ్బును ఎలా సేక‌రించిందో పార‌దర్శ‌కంగా వివ‌రిస్తే బాగుంటుంది క‌దా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English