వైసీపీ మాతో క‌లుస్తానంటే ఓకే- చంద్ర‌బాబు సంచ‌ల‌నం

వైసీపీ మాతో క‌లుస్తానంటే ఓకే- చంద్ర‌బాబు సంచ‌ల‌నం

చంద్ర‌బాబు ఒక జాతీయ మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల ముందు లేదా ఎన్నిక‌ల త‌ర్వాత మీరో వైసీపీ చ‌ర్చ‌లు జ‌రిపే అవ‌కాశం ఉందా? అని మీడియా ప్ర‌తినిధి ప్ర‌శ్నించారు. దేశం కోసం మాతో ఎవ‌రు క‌లిసినా మేము ఆహ్వానిస్తాం. అయితే, నేష‌నల్‌ ఇంట్రెస్ట్ ముఖ్యం. అత‌ను రెండు మూడు సీట్లు గెలిచి మాతో క‌లుస్తానంటే ఏం అభ్యంత‌రం లేద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌నం అయ్యింది.

న్యూస్‌18 ఢిల్లీ ప్ర‌తినిధితో చంద్ర‌బాబు ఈ వ్యాఖ్య‌లు చేశారు. అయితే, ఈ వ్యాఖ్య‌ల‌కు ముందు ఆయ‌న స్పందన ఇలా ఉంది. *నిన్న గుంటూరు స‌భ‌లో జ‌రిగిన స‌భ‌కు వ‌చ్చిన జ‌నాలు అంతా వైసీపీ త‌ర‌లించిన వారే. ఎన్డీయేలో జ‌గ‌న్ లేక‌పోయిన‌ప్ప‌టికి బీజేపీ-జ‌గ‌న్ మ‌ధ్య అక అవ‌గాహ‌న ఉంది. లేక‌పోతే ఆ స‌భ నిర్వ‌హించేటంత‌టి సామ‌ర్థ్యం గాని, నెట్‌వ‌ర్క్ గాని బీజేపీకి లేదు. క‌చ్చితంగా జ‌గ‌న్ స‌హాయం ఉంది. ఒక‌వేళ ఎన్నిక‌ల అనంత‌రం జాతీయ ప్ర‌యోజ‌నాలు కాంక్షించి జ‌గ‌న్ మాతో క‌ల‌వ‌డానికి ఆస‌క్తి చూపితే మేము వెల్‌కం చెబుతాం* అని చంద్ర‌బాబు అన్నారు.

చంద్ర‌బాబు మాట‌ల‌కు విస్మ‌యానికి గుర‌యిన ఆమె మ‌రోసారి ప్ర‌శ్న రిపీట్ చేసినా... చంద్ర‌బాబు మ‌ళ్లీ స్ప‌ష్టంగా చెప్పారు. ఆయ‌నో రెండు మూడు సీట్లు గెలిచి దేశం కోసం మాతో క‌లుస్తామంటే ఆహ్వానిస్తాం. అందులో త‌ప్పేం లేదు. అంటూ త‌న‌దైన శైలిలో చంద్ర‌బాబు స‌మాధానం ఇచ్చారు.
   

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English