అద్గదీ.. బుడ్డోడ్ని పిలవలేదు

అద్గదీ.. బుడ్డోడ్ని పిలవలేదు

మహానాడుని తెలుగుదేశం పార్టీ గొప్పగా నిర్వహించేస్తున్నది. అవసరమైనవాళ్ళకు ఆహ్వానాలు పంపి, అవసరం లేనివాళ్ళను పిలవడం మానేశారు నిర్వాహకులు. అవసరం లేనివాళ్ళలో 'బుడ్డోడు' జూనియర్‌ ఎన్టీఆర్‌ ఉన్నట్లుగా కనిపిస్తున్నది. మహానాడుకు హాజరవ్వాలనే ఆహ్వానం తనకు అందలేదని ఈ బుడ్డోడు చెప్పాడు. 'బుడ్డోడు' అని అంటే జూనియర్‌ ఎన్టీఆర్‌గారికి కోపం వస్తుంది. ఆ కోపాన్నే తన కొత్త సినిమా ట్రెయిలర్‌లోనూ ప్రదర్శించాడు. సినిమా విషయం వదిలేద్దాం. మహానాడుకి జూనియర్‌ ఎన్టీఆర్‌ని పిలవలేదంటే అది అతన్ని అవమానించడమే.

స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఆయనకు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ తనకు మహానాడు ఆహ్వానం అందకపోవడాన్ని బయటపెట్టాడు. ఇదిలా ఉండగా నందమూరి కుటుంబంలో విభేదాలు లేవని హరికృష్ణ చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. మహానాడుకు హరికృష్ణ హాజరయినప్పటికీ ఆయనకు అంతగా ప్రాధాన్యం దక్కలేదని ఓ ప్రచారం జరుగుతున్నది. కొడుకుని మహానాడుకి పిలవకపోవడంపై హరికృష్ణ స్పందించలేదు.