జ‌గ‌న్ లోట‌స్ పాండ్‌లో ప‌డుకున్నారా?

జ‌గ‌న్ లోట‌స్ పాండ్‌లో ప‌డుకున్నారా?

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్.. ఇప్పుడు య‌మా యాక్టివ్ అయిపోయారు. పార్టీకి మాత్ర‌మే ప‌రిమితం అయిన‌ప్పుడు కాస్తంత స్లోగానే వ్య‌వ‌హ‌రించిన లోకేశ్... ఎప్పుడైతే ఎమ్మెల్సీగా, మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారో, అప్ప‌టి నుంచి య‌మా యాక్టివ్ అయిపోయారు.

త‌న శాఖ‌లో జ‌ర‌గుతున్న రోజువారీ కార్య‌క్ర‌మాల‌తో పాటు ఏపీ ప్ర‌భుత్వం సాధించిన ఘ‌న‌త‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయ‌డంలో ముందుంటున్న లోకేశ్... రాజ‌కీయంగా వైరి వ‌ర్గాల‌పై త‌న‌దైన శైలి సెటైర్లు సంధించ‌డంలోనూ స్పీడు పెంచేశారు. అడ‌పా ద‌డ‌పా త‌న‌ను తాను ఇబ్బందుల పాల్జేసుకుంటున్న లోకేశ్.. ఇటీవ‌లి కాలంలో మరింత ఫ‌ర్‌ఫెక్ష‌నిజంతో వ్య‌వ‌హ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు.

ఈ క్ర‌మంలో నేడు ఏపీ టూర్‌కు వ‌చ్చిన మోదీకి నిర‌స‌న తెలిపే క్ర‌మంలో న‌ల్ల దుస్తుల‌తోనే అధికారిక కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రైన లోకేశ్... ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాక‌ముందు కూడా ట్విట్ట‌ర్ లో త‌న నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు.

అంతేకాకుండా ఏపీకి తీర‌ని అన్యాయం చేసిన మోదీ... రాష్ట్రానికి వ‌స్తుంటే... ఓ ప్ర‌తిప‌క్ష నేత‌గా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎక్క‌డ ఉన్నారంటూ ప్రశ్నించిన లోకేశ్... ట్విట్ట‌ర్ వేదిక‌గా సంధించిన ఓ ట్వీట్ ఇప్పుడు వైర‌ల్‌గానే మారిపోయింది. ఈ ట్వీట్ లో జ‌గ‌న్‌ను లోకేశ్ ఓ రేంజిలో ఏకిపారేశార‌నే చెప్పాలి. లోకేశ్ ట్వీట్ ఎలా సాగింద‌న్న విష‌యానికి వ‌స్తే...

"మోడీ గారు పర్యటన సందర్భంగా రాష్ట్రమంతా ఒక్కటై రోడ్డెక్కి హోదా కోసం పోరాడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ ఎక్కడా? వైకాపా నాయకులు ఎక్కడ? 26 కేసులుకు బయపడి జగన్ దాక్కున్నారా?అరెస్ట్ చేసి జైలు కి పంపుతారు అని భయం పట్టుకుందా?లేక లోటస్ పాండ్ లో పడుకున్నారా?" అంటూ ఆయ‌న జ‌గ‌న్ వైఖ‌రిని తూర్పార‌బ‌ట్టారు. సెటైరిక్‌గా సంధించిన ఈ ట్వీట్ ద్వారా జ‌గ‌న్‌ను ఆయ‌న పార్టీ నేత‌ల‌ను లోకేశ్ గ‌ట్టిగానే కార్నర్ చేశార‌న్న‌వాద‌న వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English