ఓటుకునోటు..కేసీఆర్‌పై మ‌త్త‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఓటుకునోటు..కేసీఆర్‌పై మ‌త్త‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకు నోటు కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న మత్తయ్య తాజాగా, క‌ల‌క‌లం సృష్టించారు. ఈ కేసులో తాజాగా ఆయ‌న ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. ఈ కేసులో రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడిన చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

సీబీఐ ,ఎన్ఐఏతో విచారణ జరిపితే అసలు దోషులెవరో తేలతారని, ఓటుకు నోటు కేసులో నన్ను బలిపశువును చేశారని మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో నన్ను ఏ4 గా చేర్చడం ఇంకా మిస్టరీగానే ఉందని, ప్రభుత్వాలు నన్ను ఇబ్బందులకు గురిచేసాయని మ‌త్త‌య్య వాపోయారు. సుప్రీంకోర్టులో నా వాదనలు నేనే వినిపించుకోవాలని భావించినప్పటికీ అమికస్ క్యూరిని నియమించి వాదనలు వినిపించే అవకాశం లేకుండా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమికస్ క్యూరి అయిన సిద్దార్థ దవే నా తరుపున వాదించాల్సి ఉన్నా అమ్ముడుపోయి, నాకు పాస్ రాకుండా చేసారని ఆరోపించారు. "కుట్ర పూరితంగానే ఉదయ సింహ నా పిటిషన్ లో ఇంప్లీడ్ అయ్యాడు. పట్టుబడ్డ దొంగలందరు ఈ కేసులో ఇంప్లిడ్ అవ్వాలని డిమాండ్ చేస్తున్నా.ఏపీ సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ లు కూడా నా పిటిషన్లో ఇంప్లిడ్ అవ్వాలి" అని జెరూసలేం మత్తయ్య అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ప్రలోభాలకు గురి చేశారని మత్తయ్య ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసును సీబీఐ, ఎన్‌ఐఏతో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.  ఓటుకు నోటు కేసును ఎన్ఐఏ తో కానీ,సీబీఐతో  కానీ  విచారణ జరపాలని కోరారు. త‌న‌కు జరుగుతున్న అన్యాయంపై ఈనెల 11వ తేదీన‌ ఢిల్లీలో ధర్నా చేస్తానని మత్తయ్య అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English