ప్రియాంక‌నే రావాలి...తెలుగు కాంగ్రెస్ నేత‌ల కొత్త డిమాండ్‌

ప్రియాంక‌నే రావాలి...తెలుగు కాంగ్రెస్ నేత‌ల కొత్త డిమాండ్‌

కాంగ్రెస్ పార్టీకి కొత్త ఆశ తెర‌మీద‌కు వ‌స్తోంది. ఆ పార్టీ యువ‌నేత ప్రియాంక గాంధీ రూపంలో ఈ భ‌రోసాను హ‌స్తం నేత‌లు పెంచుకుంటున్నారు. ఆమెకు ఉత్తరప్రదేశ్ లో పరిమితంగా పార్టీ బాధ్యతలను అప్పగించింది. అయినా సరే, మా రాష్ట్రానికి రావాలంటే మా రాష్ట్రానికి రావాలంటూ ఇతర రాష్ట్రా ల నేతలు ఏఐసీసీకి వినతులు పంపిస్తున్నారు. పలు రాష్ట్రా ల్లో ఆమెకు స్వాగతం చెబుతూ ముందే హోర్డింగులు కూడా పెట్టేస్తున్నారు. హైకమాండ్ ఆలోచన వేరేలా ఉన్నా… ప్రచారానికి ప్రియాంకను పంపించాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు. ఇందులో తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ప్ర‌థ‌మ స్థానంలో నిలుస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్ ఈస్ట్ ఇన్ చార్జ్ గా బాధ్యతలు తీసుకున్న ప్రియాంక అంతవరకే పరిమితం అవుతారని ఏఐసీసీ చెబుతున్నా రాష్ట్ర నేతలు తగ్గడం లేదు. జనవరి 23న ప్రియాంకను ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా నియమిస్తూ యూపీ తూర్పు వ్యవహారాలను అప్పగించారు. దీనిపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం ఉప్పొంగింది. ఈ నిర్ణయం యూపీలోనే కాకుం డా దేశమంతా పార్టీ కేడర్ లో జోష్ నింపుతుందని రాహుల్ భావించారు. అనుకున్నట్లుగా నే స్పందన వస్తున్నా.. అది ఇంకాస్త  ముందుకు పోయి అన్ని రాష్ట్రా ల్లోనూ ప్రచారం చేయాలని అడుతున్నారు.  ఇందిరాగాంధీని గుర్తుచేస్తారనే… నాయనమ్మ ఇందిరాగాంధీ పోలికలు స్పష్టంగా కనిపించే ప్రియాంకాగాంధీ ప్రచారానికి వస్తే బాగా కలిసొస్తుందని రాష్ట్రాల నేతలు నమ్ముతున్నారు. ఆమె వస్తే సభలకు భారీగా జనం రావడం ఖాయమని వారు భావిస్తున్నారు. ఇప్పటికీ ఇందిరమ్మ పేరు చెబితే ఓట్లేసే జనం ఉన్నారనీ, ప్రియాంక రాకతో ఆమెను గుర్తు చేసినట్లు ఉంటుందన్నది కాంగ్రెస్ నేతల ఆలోచన అని తెలుస్తోంది.

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వచ్చి ప్రచారం చేయాలని ఇప్పటికే దాదాపు 20 రాష్ట్రాల కాంగ్రెస్ నేతల నుంచి ఏఐసీసీకి వినతులు వచ్చాయి. కొన్ని పీసీసీల నుంచి లేఖలు కూడా రాశారు. కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ, తమిళనాడు, గుజరాత్, రాజస్థా న్, పశ్చిమ బెంగాల్, హర్యానా , మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, బీహార్ నుంచి కూడా ఆమె రాక కోసం ఏఐసీసీకి వినతులు వెల్లువెత్తాయి. మరికొన్ని రాష్ట్రాల పీసీసీల నుంచీ ఇదే డిమాండ్ వినిపిస్తోంది. ప్రియాంక ప్రచారానికి రావాలని తెలుగు రాష్ర్టాల‌ కాంగ్రెస్ నేతలు కూడా హైకమాండ్ ను కోరుతున్నారు. గతంలో ఇందిరాగాంధీ పోటీ చేసిన మెదక్ పార్లమెంట్ సీట్ నుంచే ప్రియాంకను బరిలోకి దింపాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే రాహుల్ ను కోరారు. ఈనెల 5న రాహుల్ తో జరిగిన సమావేశంలో ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా ఇదే డిమాండ్ వినిపించారు. ఇందిరాగాంధీని పోలి ఉన్న ప్రియాంక ఏపీలో ప్రచారం చేయాలని రాహుల్ ను కోరినట్లు ఆంధ్రా పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English