ఈసీ సంచ‌ల‌నంఃజిల్లా క‌లెక్ట‌ర్ స‌స్పెండ్‌

ఈసీ సంచ‌ల‌నంఃజిల్లా క‌లెక్ట‌ర్ స‌స్పెండ్‌

ఎన్నిక‌ల క‌మిష‌న్ వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఒమర్‌ జలీల్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఎన్నికలపై కోర్టులో పిటిషన్‌ ఉన్నప్పటికీ ఈవీఎం, వీవీప్యాట్‌ యంత్రాలు తెరిచిన అంశంలో సస్పెండ్‌ చేశారు. ఒమర్‌ జలీల్‌ను సస్పెండ్‌ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఘటనపై తదుపరి విచారణకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపర్ చేశారని విపక్షాలు ఆరోపణలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈవీఎంల రిగ్గింగ్‌ వల్లే ఓడిపోయామని గతంలో కొడంగల్‌, పరిగి, వికారాబాద్‌ నియోజకవర్గాల కాంగ్రెస్‌ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. కేసు కోర్టులో ఉండగానే బెంగళూరు నుంచి వచ్చిన బీహెచ్ఈఎల్‌ ఇంజనీర్లు ఆ నియోజకవర్గాల ఈవీఎంలను కలెక్టర్ సమక్షంలో తనిఖీ చేయడంతో వివాదం ముదిరింది. లోక్‌సభ ఎన్నికల కోసం ఈవీఎంలను సిద్ధం చేయడానికి  వాటిని తనిఖీ చేస్తున్నామని అధికారులు చెప్తుండ‌గా...అందులో ఏదో మతలబు ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ ఎపిసోడ్‌లో ఈవీఎంల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ను సస్పెండ్ చేస్తూ ఈసీ నిర్ణ‌యం తీసుకుంది. ఇదిలాఉండ‌గా, వివాదాలు లేని అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను మాత్రమే పరిశీలించాలని ఈసీ బీహెచ్ఈఎల్ వ‌ర్గాల‌ను కోరింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English