మోదీకి ‘నో ఎంట్రీ’... రేపేం జరగబోతోంది?

మోదీకి ‘నో ఎంట్రీ’... రేపేం జరగబోతోంది?

గుంటూరులో ప్రధాని మోదీ సభ నేపథ్యంలో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన రాకను టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు బ్లాక్ డేగా పాటిస్తుండడం.. నిరసనలు తెలపాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడంతో మోదీ సభకు ఆటంకాలు ఏర్పడొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే విజయవాడ, గుంటూరుల్లో మోదీకి నో ఎంట్రీ పెద్దపెద్ద హోర్డింగులు ఏర్పాటయ్యాయి. విజయవాడ విమానాశ్రయం దారిలోనూ ఇలాంటి హోర్డింగులు ఏర్పాటయ్యాయి.
    
కాగా ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించినప్పుడు కూడా తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. ఇప్పుడు ప్రధాని పర్యటనలోనూ అలాంటి పరిస్థితులే ఉత్పన్నమైతే ఎలా అని బీజేపీ నేతల్లో టెన్షన్ కనిపిస్తోంది. అదేసమయంలో ప్రధానిని అడ్డుకుంటే పరిస్థితులు ఎలా మారుతాయన్న ఆందోళనా చాలామందిలో ఉంది.
    
అయితే... టీడీపీ శ్రేణులకు ప్రధాని పర్యటనకు అడ్డుతగలాలన్న సంకేతాలు అందాయని వినిపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం నిరసనలకే పరిమితం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా తమ కార్యకర్తలు నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలుపుతారని చెప్పారు.
    
మరోవైపు శనివారం అస్సాంలో పర్యటించిన మోదీకి అక్కడా నల్లజెండాలతో నిరసన వ్యక్తమైంది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కూడా ఇటీవల ఆయన విమానం ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం ఉదయం 11 గంటలకు గుంటూరులో ఆయన కార్యక్రమం ఉండడంతో.. ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఎదురుకానున్నాయన్నది చూడాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English