బాబు సీఎం అవ‌డం ఖ‌ర్మ‌...

బాబు సీఎం అవ‌డం ఖ‌ర్మ‌...

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఓ వైపు ప్ర‌జాక్షేత్రంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై ఆరోప‌ణ‌లు గుప్పిస్తూనే మ‌రోవైపు ప్ర‌జాస్వామ్య‌యుత వేదిక‌ల్లోనూ ఆయ‌న‌పై పోరాటం కొన‌సాగిస్తున్నారు. తాజాగా, రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను జగన్ కలిశారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు, అవకతవకలపై ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. సమావేశం ముగిసిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ పోలీస్ అధికారుల నియామకాల్లోనూ అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. .రాజకీయ స్వార్థం కోసం టీడీపీ సర్కార్ పోలీసులను ఉపయోగించుకొంటోందని...బాబు ఆధ్వర్యంలో పోలీసు యంత్రాగం నడుస్తోందని మండిప‌డ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగిస్తున్నారని, ఓటర్ల జాబితాలో అవకతవకలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామ‌న్నారు. `ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయాలనే గవర్నర్‌కు చెప్పడం జరిగింది. దాదాపుగా 59 లక్షల బోగస్‌ ఓట్లు ఎలా ఉన్నాయో.. వాటిని తొలగించాల్సిన అవసరం ఎంతగా ఉందో వివరించాం. ఇదికాక అధికారాన్ని అడ్డం పెట్టుకుని రకరకాల సర్వేల పేరుతో ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్న విషయాన్ని గవర్నర్‌కు ఆధారాలతో సహా తెలియజేశాం. దాని ఆధారంగా టీడీపీకి ఓటు వేయని వారిని గుర్తించి.. వారి ఓట్లను దగ్గరుండి తొలగించే కార్యక్రమం ఎలా చేస్తున్నారో గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లాం.`` అని జగ‌న్ వివరించారు

చంద్ర‌బాబు ముఖ్యమంత్రి కావడం ఖర్మ అని...ఆయ‌న వ‌ల్లే హోదా రాలేదని జ‌గ‌న్ అన్నారు. గతంలో అసెంబ్లీలో హోదాపై బాబు ఏమి మాట్లాడారో అందరికీ గుర్తుందన్నారు జగన్. హోదా ఇచ్చిన రాష్ట్రాలు ఏమి బాగుపడ్డాయ్...అదేమన్నా సంజీవనా ? అని మాట్లాడలేదా గుర్తు చేశారు. ఫిబ్రవరి 11వ తేదీన సీఎం బాబు చేపట్టే  దీక్ష దొంగ దీక్ష అంటూ జగన్ ఎద్దేవా చేశారు. ఒక వ్యక్తిని తానే పొడిచేసి ఆ హత్యకు వ్యతిరేకంగా దీక్ష చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నారు. హోదా వద్దంటూ..ప్యాకేజీ గురించి బాబు లాబీయింగ్ చేశారని...అప్పుడు జైట్లీ..బీజేపీ పాలనను గొప్పగా పొగడలేదా అని జగన్ సూటిగా ప్రశ్నించారు. నాలుగున్నరేళ్ల తరువాత బాబు యూ టర్న్ తీసుకుని...హోదాపై దీక్షలు చేస్తుండడం హాస్యాస్పదమన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English