వామ్మో.. ఏకంగా కోహ్లీని మ్యాచ్ చేసిందే

వామ్మో.. ఏకంగా కోహ్లీని మ్యాచ్ చేసిందే

పూసర్ల వెంకట సింధు.. షార్ట్‌గా చెబితే పి.వి.సింధు.. ఇప్పుడు దేశంలో యాక్టివ్‌గా ఉన్న క్రీడాకారుల్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కోహ్లి తర్వాత అంత క్రేజ్ ఉన్నది ఈ అమ్మాయికే అంటే అతిశయోక్తి లేదు. గత రెండున్నరేళ్లలో ఆమె బ్రాండ్ వాల్యూ మామూలుగా పెరగలేదు. ఫోర్బ్స్ సంస్థ గత ఏడాది ప్రపంచంలో అత్యధిక బ్రాండ్ వాల్యూ ఉన్న క్రీడాకారిణుల జాబితాను ప్రకటించగా.. అందులో సింధుకు ఏడో స్థానం దక్కింది. దీన్ని బట్టే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒక బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఈ స్థాయికి చేరడం అనూహ్యం.

క్రికెట్ అంటే పడి చచ్చే మన దేశంలో విరాట్ కోహ్లి లాంటి సూపర్ స్టార్‌తో సమానంగా సింధు బ్రాండ్ వాల్యూ సంపాదించుకోవడం మామూలు విషయం కాదు. 2017లో కోహ్లితో ప్యూమా సంస్థ ఒక భారీ ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం ఎనిమిదేళ్ల కాలానికి కోహ్లి రూ.100 కోట్లు అందుకుంటాడు. ఇప్పుడు చైనాకు చెందిన క్రీడా పరికరాల తయారీ సంస్థ లి నింగ్.. సింధుతో నాలుగేళ్ల కాలానికి రూ.50 కోట్లతో  ఒప్పందం చేసుకుంది. కోహ్లి ఎనిమిదేళ్లకు 100 కోట్లు తీసుకుంటే.. సింధు నాలుగేళ్లకు 50 కోట్లు అందుకోబోతోంది. అంటే ఇద్దరి బ్రాండ్ వాల్యూ సమానం అన్నమాట.

2016 రియో ఒలింపిక్స్‌కు ముందు వరకు సింధు వేరు. ఆ మెగా టోర్నీలో రజతం గెలిచాక సింధు వేరు. దేశవ్యాప్తంగా కోట్లాదిమందిని తన అభిమానులుగా మార్చుకున్న సింధు.. తర్వాత వెనుదిరిగి చూసింది లేదు. తనకు వచ్చిన పాపులారిటీ చూసుకుని పొంగిపోకుండా.. ఆటమీద మరింత శ్రద్ధ పెట్టి ఇంకా ఉన్నత స్థానానికి చేరింది. దీంతో ఆమె బ్రాండ్ వాల్యూ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. 2016లో యోనెక్స్ సంస్థ ఏడాదికి రూ.3.5 కోట్ల చొప్పున చెల్లిస్తూ మూడేళ్లకు ఒప్పందం చేసుకుంటే.. ఇప్పుడు సింధు ఏడాదికి రూ.12.5 కోట్లు అందుకునే స్థాయికి చేరుకుంది. దీన్ని బట్టే సింధు ఎదుగుదల ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English