మ‌నోళ్ల‌కు తీపిక‌బురుః గ్రీన్‌కార్డు కోటాకు చెల్లు!

మ‌నోళ్ల‌కు తీపిక‌బురుః గ్రీన్‌కార్డు కోటాకు చెల్లు!

అగ్ర‌రాజ్యం అమెరికా కాంగ్రెస్ ముందుకు రెండు కీలక బిల్లులు వ‌చ్చాయి. ఈ రెండు బిల్లుల‌కు ఆమోదం లభిస్తే లక్షలాది భారతీయ నిపుణులకు లబ్ధి చేకూర‌నుంది. మ‌నోళ్లు సుదీర్ఘంగా ఉన్న నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డ‌నుంది. ఆ రెండు బిల్లుల సారంశం....అమెరికాలో శాశ్వత నివాసానికి అవసరమైన గ్రీన్‌కార్డుల జారీకి ప్రస్తుతం అనుసరిస్తున్న దేశాల కోటా పద్ధతిని ఎత్తివేసి ప్రతిభ ఆధారంగా గ్రీన్‌కార్డులు మంజూరు చేయ‌డం. ఈ రెండు కీలక బిల్లులను అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. ఇవి అమల్లోకి వస్తే లక్షలాది మంది భారతీయ నిపుణులకు లబ్ధి చేకూరనుంది.

ప్రస్తుతం అమెరికా ఏటా 1,40,000 గ్రీన్‌కార్డులను జారీ చేస్తున్నది.అయితే దేశ జనాభాతో సంబంధం లేకుండా ప్రతి దేశానికి 7 శాతం కోటా పరిమితి అమలు చేస్తున్నది. దీని వల్ల భారత్, చైనాలకు చెందినవారికి నష్టం కలుగుతోంది. దీంతో తాజా బిల్లు తెరమీద‌కు వ‌చ్చింది. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల జారీలో దేశాలకు కేటాయించే 7 శాతం కోటా పరిమితిని ఎత్తివేసేందుకు ఉద్దేశించిన ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్ యాక్ట్‌ను రిపబ్లిక్ సభ్యుడు మైక్ లీ, డెమోక్రటిక్ సభ్యులు కమలా హ్యారిస్ బుధవారం సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఇలాంటిదే మరో బిల్లును కాంగ్రెస్ సభ్యులు జో లోఫ్‌గ్రెన్, కెన్ బక్‌లు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు.

ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం హెచ్‌ 1బీ ఉద్యోగులు 151 ఏళ్లుగా అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం ఉద్యోగ ఆధారిత వలసదారులకు ఏడాదికి 140000 గ్రీన్‌ కార్డులను ఇస్తున్నారు. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత అనే సూత్రాన్ని పాటిస్తున్నారు. అమెరికా ఇచ్చే గ్రీన్‌ కార్డులు ఒక దేశానికి 7 శాతం కంటే మించకూడదని ప్రస్తుత చట్టాలు చెబుతున్నాయి.

ఈ నిబంధనలతో భారత్‌- చైనా లాంటి దేశాల పోస్ట్‌ గ్రాడ్యూయేట్లు గ్రీన్‌కార్డు పొందాలంటే కనీసం 50 ఏళ్లు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. తక్కువ జనాభా కలిగిన దేశాల వాళ్లకు మాత్రం కొన్నేళ్లలోనే శాశ్వత నివాస అనుమతి లభిస్తోంది. సెనెట్‌లో హెచ్‌ఆర్‌ 1044 బిల్లును ప్రవేశపెట్టిన సందర్బంలో భారతీయ అమెరికన్‌ కమలా హ్యారీస్‌ మాట్లాడుతూ మా దేశం వలసదారులది. భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదంతో మా విద్యార్థులు అమెరికా వస్తున్నారు అని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English