కేబినెట్ ముహుర్తం ఖ‌రారు...కేటీఆర్‌, హ‌రీశ్‌ల‌కు డౌటే

కేబినెట్ ముహుర్తం ఖ‌రారు...కేటీఆర్‌, హ‌రీశ్‌ల‌కు డౌటే

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీల‌క క‌స‌ర‌త్తుకు తెర‌దించిన‌ట్లు స‌మాచారం. గ‌త కొద్దికాలంగా తీవ్ర ఉత్కంఠ‌ను సృష్టిస్తున్న తెలంగాణ కేబినెట్ స‌స్పెన్స్ ఎపిసోడ్‌కు తెర‌దించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేయగా మిగతా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అన్నది గులాబీ నేతలను కలవరపెడుతున్న ఎపిసోడ్‌కు తెర‌దించుతూ రాబోయే ప‌దో తేదీన కేబినెట్‌ పదవుల పందేరం చేయబోతున్నారని టీఆర్ఎస్‌ వర్గాల స‌మాచారం.

పాత, కొత్తల మిశ్రమంగా కేబినెట్‌ కూర్పు ఉంటుందని సీఎం కేసీఆర్‌ స్పష్టంగా ప్రకటించినప్ప‌టికీ, గ‌తంలో పనిచేసిన మంత్రులందరికీ మళ్లి కేబినెట్‌ బెర్తులు దక్కే అవకాశం లేదు. మొత్తం కేబినెట్‌లో ఆరు నుండి ఎనిమిది మంది కొత్తవారు ఉండే అవకాశం ఉందని, తొలివిడత కేబినెట్‌ విస్తరణలోనూ ఇద్దరు లేదా ముగ్గురు కొత్తవారు ఉండవచచ్చన్న అంచనాలు ప్రచారంలో ఉన్నాయి. ప్ర‌ధానంగా పలువురు సీనియర్లకు విస్తరణలో మొండి చెయ్యి చూప‌న‌న్న కేసీఆర్ ఇదే లెక్క‌ల్లో భాగంగా, త‌న మేన‌ల్లుడు హరీశ్ రావు, త‌న‌యుడు కేటీఆర్‌కు మంత్రి పదవులు కేటాయించ‌డం డౌటేన‌ని స‌మ‌చారం. స్థూలంగా 10 మంది మంత్రులకు చోటు దక్కే అవకాశం ఉందని స‌మాచారం.తుది జాబితాపై కేసీఆర్ కసరత్తు పూర్త‌యింద‌ని, ఈ నెల 10న వ‌సంత పంచ‌మి సంద‌ర్భంగా తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుంద‌ని ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లోని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.,

మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ అనంత‌రం త‌దుప‌రి ప్ర‌క్రియ‌పై కేసీఆర్ దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. కేంద్రప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్ కేటాయింపుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని, తెలంగాణ‌లో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశ పెట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. ఫిబ్ర‌వ‌రి రెండో వారంలో ఈ ప్ర‌క్రియ‌ను పూర్తిచేసి పార్ల‌మెంటు ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత పూర్తిస్థాయి కేబినెట్ కూర్పు ఉంటుంద‌ని తెలుస్తోంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English