సీఎం మంచి సినీ నిర్మాత..అందుకే నా వాయిస్‌తో డ‌బ్బింగ్

సీఎం మంచి సినీ నిర్మాత..అందుకే నా వాయిస్‌తో డ‌బ్బింగ్

క‌ర్ణాట‌క రాజ‌కీయ వేడి మ‌రోమారు తారాస్థాయికి చేరింది. అధికార పార్టీని కూల‌దోసేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని, జేడీఎస్ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని సీఎం కుమారస్వామి ఆరోపణలు చేసి సంగ‌తి తెలిసిందే. దీంతో పాటుగా, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్ యడ్యూరప్ప.. జేడీఎస్ ఎమ్మెల్యే నాగన్న గౌడకు డబ్బు ఎరవేస్తున్న అంశానికి సంబంధించిన ఆడియో టేపును కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఇవాళ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తమ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కుమారస్వామి ఆరోపించారు. జేడీఎస్ ఎమ్మెల్యే నాగన్న గౌడ కుమారుడు శరణకు యడ్యూరప్ప ఫోన్ చేసి తమకు మద్దతిస్తే రూ. 25 లక్షలు ఇస్తామని, నాన్నకు మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేశారని కుమారస్వామి తెలిపారు. వీటన్నింటిపై ఆధారాలతో సహా రుజువు చేస్తా. తమ ఎమ్మెల్యేలకు డబ్బు ఎరచూపి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టాలని  చూస్తోందని కుమారస్వామి వెల్ల‌డించారు.

అయితే, బీఎస్ యడ్యూరప్ప స్పందించారు. సీఎం కుమారస్వామి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే అని యడ్యూరప్ప స్పష్టం చేశారు. య‌డ్యూరప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదంతా అబద్ధమని, తనను ఇరికించాలని కావాలనే ఈ వీడియోను సృష్టించారని ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో అభివృద్ధే జరగలేదన్నారు. జేడీఎస్‌ ఎమ్మెల్యే నాగన గౌడకు డబ్బు ఎరవేసేందుకు ప్రయత్నించానని చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమ‌ని య‌డ్యుర‌ప్ప వెల్ల‌డించారు. ``నేను ఎవర్నీ కలవలేదు. ఆలయ దర్శనం కోసం ఇటీవల నేను దేవదుర్గ వెళ్లాను. వెంటనే తిరిగొచ్చాను. కానీ అక్కడ నాగన గౌడ కుమారుడు శరణ్‌ గౌడ నన్ను కలిసినట్లు, నాతో మాట్లాడినట్లు రికార్డు చేశారు. అదంతా అబద్ధం. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కుమారస్వామి ఈ డ్రామా ఆడుతున్నారు. కుమారస్వామి ఓ నిర్మాత కదా. వాయిస్‌ రికార్డింగ్‌లో ఆయనకు మంచి నైపుణ్యం ఉంది. అలాగే ఈ వీడియోను సృష్టించారు’ అని యడ్యూరప్ప దుయ్యబట్టారు.

ఇదిలాఉండ‌గా, కర్నాటక బీజేపీ ప్రెసిడెంట్, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప, బీజేపీ ఎమ్మెల్యే మల్లేశ్వరం, అశ్వత్ నారాయణ్‌తో పలువురిపై న్యాయవాది ఆర్ఎల్ఎన్ మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాసనసభ సభ్యులను పలువురిని వీరు కిడ్నాప్ చేసేందుకు యత్నిస్తున్నారని అదేవిధంగా బలవంతంగా వారిని నిర్బంధిస్తున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనకుండా చేస్తున్నారని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English