ప్ర‌భుత్వాన్ని కూల్చే స్కెచ్‌....బ‌య‌ట‌ప‌డిన ఆడియో టేపులు

ప్ర‌భుత్వాన్ని కూల్చే స్కెచ్‌....బ‌య‌ట‌ప‌డిన ఆడియో టేపులు

క‌ర్ణాట‌క‌లో మ‌రో మారు రాజ్యాంగ సంక్షోభం ఏర్ప‌డే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. గత కొంత కాలంగా కర్ణాటకలోని జేడీఎస్- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదనీ, ఇందుకోసం తమ ఎమ్మెల్యేలకు భారీగా సొమ్ము, మంత్రిపదవుల ఎర చూపుతున్నదని కాంగ్రెస్, జేడీఎస్‌లు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని గత కొంత కాలంగా ఆరోపిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార స్వామి ఈ రోజు అందుకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ విడుదల చేశారు.

జేడీఎస్ ఎమ్మెల్యే నాగనగౌడ కంద్ కూర్ కుమారుడు శరాణాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యెడ్యూరప్పల మధ్య సంభాషణలకు సంబంధించిన ఆడియోగా కుమార స్వామి చెప్పారు. ఆ ఆడియోలో యెడ్యూరప్ప పాతిక లక్షల రూపాయలు, మంత్రి పదవి ఇస్తానంటూ చెబుతున్న మాటలు ఉన్న  ఆడియో సంచలనం సృష్టిస్తోంది.

తాజాగా బెంగ‌ళూరులో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్ యడ్యూరప్ప.. జేడీఎస్ ఎమ్మెల్యే నాగన‌గౌడకు డబ్బు ఎరవేస్తున్న అంశానికి సంబంధించిన ఆడియో టేపును కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విడుదల చేశారు. తమ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కుమారస్వామి పేర్కొన్నారు. జేడీఎస్ ఎమ్మెల్యే నాగన‌ గౌడ కుమారుడు శరణకు యడ్యూరప్ప ఫోన్ చేసి తమకు మద్దతిస్తే రూ. 25 లక్షలు ఇస్తామని, నాన్నకు మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేశారని కుమారస్వామి తెలిపారు.

వీటన్నింటిపై ఆధారాలతో సహా రుజువు చేస్తా. తమ ఎమ్మెల్యేలకు డబ్బు ఎరచూపి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తోందన్నారు. ఇప్పటికే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనబడట్లేదు అని సీఎం పేర్కొన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఒక వైపు మాత్రం ప్రధాని మోడీ సత్యాలు వల్లెవేస్తున్నారు. మరోవైపు సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు అని కుమారస్వామి మండిపడ్డారు.

మోడీ ప్రభుత్వం స్వతంత్ర దర్యాప్తు సంస్థలను నిర్వీర్యం చేస్తోందని కుమార‌స్వామి దుయ్యబట్టారు. వీటన్నింటినీ ఆధారాలతో సహా నిరూపిస్తానని ఆయన చెప్పారు. మోడీ ప్రభుత్వం అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని ఆయన అన్నారు. తమ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. డబ్బు ఎర చూపి ప్రలోభాలకు గురి చేస్తోందని ఆయన అన్నారు. ఇప్పటికీ ఐదుగురు ఎమ్మెల్యేలు కనబడటం లేదని ఆయన చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English