క‌మ‌ల్ భారీ ప్ర‌క‌ట‌న‌..అంత స‌త్తా ఉందా?

క‌మ‌ల్ భారీ ప్ర‌క‌ట‌న‌..అంత స‌త్తా ఉందా?

సినీన‌టుడు, మక్కల్ నీధి మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో 40 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్ర‌క‌టించారు. గురువారం ఆయన చైన్నెలో మీడియాతో మాట్లాడుతూ, లోక్ సభ ఎన్నికల్లో ఎవరితోనూ కలిసేది లేదని స్పష్టం చేశారు. తమిళనాడు, పుదుచ్చేరి పరిధిలోని 40 పార్లమెంట్ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు. తాను కూడా పార్లమెంట్‌కు పోటీ చేయనున్నట్లు తెలిపారు. కానీ ఏ స్థానం నుంచి పోటీ చేసేది మాత్రం మీడియాకు తెలపలేదు.

కొద్దికాలం క్రితం మ‌క్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో దోస్తీకి సిద్ధమని స్పష్టం చేసిన ఆయన, అయితే దానికి కొన్ని కండిషన్లు ఉన్నాయని... డీఎంకేతో తెగదెంపులు చేసుకుంటేనే పొత్తు పెట్టుకుంటామని కీలకమైన మెలిక పెట్టేశారు. కాంగ్రెస్ పార్టీకి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టే ఇచ్చి షరతు పెట్టారు. దీంతో, కాంగ్రెస్ ఆయ‌నతో పొత్తు పెట్టేందుకు సిద్ధ‌ప‌డ‌లేద‌ని తెలుస్తోంది. దీంతో, `మక్కల్ నీది మయ్యం` పార్టీ అధినేత కమల్ హసన్ కీలక ప్రకటన చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎవరితో కలవదని ఆ పార్టీ స్పష్టం చేశారు. తమిళనాడు, పుదుచ్చేరిలో 40 స్థానాల్లో ఎంఎన్ఎం పోటీ చేస్తుందని చెప్పారు. ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని చెప్పిన కమల్ హాసన్..తాను ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నది మాత్రం ఇప్పుడే చెప్పలేనన్నారు.

అయితే, క‌మల్‌కు ఇన్ని స్థానాల్లో పోటీ చేసే స‌త్తా నిజంగా ఉందా?  సొంతంగా ఆయ‌న బ‌రిలో దిగ‌గ‌లరా? అనే సందేహాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. దీంతో పాటుగా, కాంగ్రెస్‌తో పొత్తు విష‌యంలో ఎక్క‌డ చెడింద‌నే సందేహాలు సైతం తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English