కండువా మార్చిన ఆదిశేష‌గిరి రావు..అభిమానుల‌కు ఆర్డ‌ర్‌

కండువా మార్చిన ఆదిశేష‌గిరి రావు..అభిమానుల‌కు ఆర్డ‌ర్‌

సూపర్‌స్టార్‌ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు త‌న కండువా మార్చుకున్నారు. గతంలో వైసీపీలో ఉన్న ఆదిశేషగిరిరావు ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలో ఆహ్వానించారు. విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ఆదిశేషగిరిరావు చంద్ర‌బాబుపై పొగ‌డ్త‌లు కురిపించారు. అదే స‌మ‌యంలో, కృష్ణ అభిమానుల‌కు సూచ‌న‌లు చేశారు.

వైసీపీకి రాజీనామా చేసిన ఆదిశేష‌గిరిరావును టీడీపీలోకి వ‌చ్చేలా ఆ పార్టీ ప్ర‌య‌త్నం చేసిన సంగ‌తి తెలిసిందే. గుంటూరు జిల్లాలోని తెనాలిలో ఆయన నివాసానికి ఇవాళ టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, ఆలపాటి రాజా, గద్దె రామ్మోహన్ రావు, వర్ల రామయ్య, జలీల్ ఖాన్ వెళ్లారు. తెలుగుదేశం పార్టీలో చేరాలని కోరారు. దీంతో ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. చేరిక సంద‌ర్భంగా ఆదిశేష‌గిరి రావు మాట్లాడుతూ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రమైన సమస్యల్లో ఉందని అన్నారు.  ఆర్థిక ఇబ్బందుల్లో కూడా పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు చంద్ర‌బాబు ముందుకు తీసుకుపోతున్నార‌ని, ఇందుకు ఆయ‌న అభినందనీయమని తెలిపారు. సీఎం చంద్రబాబు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. మరో ఐదు సంవత్సరాలు చంద్రబాబు రాష్ట్రానికి సీఎంగా పనిచేయాలని ఆదిశేష‌గిరిరావు ఆకాంక్షించారు. అన్నయ్య కృష్ణ ఆశీర్వాదం తీసుకున్నాను. ఆయన అభిమానులు టీడీపీ విజయానికి కృషి చేయాలని ఆదిశేషగిరి రావు పిలుపునిచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English