మోడీ ఓ పిరికిపంద‌...నాతో 10 నిమిషాలు కూడా మాట్ల‌డ‌లేడు

మోడీ ఓ పిరికిపంద‌...నాతో 10 నిమిషాలు కూడా మాట్ల‌డ‌లేడు

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ల‌క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ విమ‌ర్శ‌ల‌ ప‌ర్వం కొన‌సాగుతోంది. వివిధ అంశాల వారీగా ఆయ‌న మోడీని టార్గెట్ చేయ‌డంలో మ‌రో అడుగు వేశారు. ఏఐసీసీ మైనార్టీ సెల్ స‌మావేశం సంద‌ర్భంగా రాహుల్ మాట్లాడుతూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై ఇవాళ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. మోదీ పిరికిపంద అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ద‌మ్ముంటే అత‌ను ఓ 10 నిమిషాల పాటు త‌న‌తో చ‌ర్చించాల‌ని రాహుల్ స‌వాల్ విసిరారు.

త‌న‌ది 56 ఇంచుల‌ ఛాతి అని మోడీ  ప్ర‌క‌టించుకున్నార‌ని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ఆ ప్ర‌క‌ట‌నే నిజ‌మైతే...త‌న‌తో ముఖాముఖి చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాల్ చేస్తున్నాన‌ని రాహుల్ అన్నారు. స్టేజ్ మీద ఆయ‌న నాతో ప‌ది నిమిషాలు కూడా మాట్లాడ‌లేడ‌ని, అత‌నో ప‌రికిపంద అని రాహుల్ విమ‌ర్శించారు. ఏ ఎజెండా లేకుండానే మోడీ చైనాకు వెళ్లార‌ని, డోక్లామ్ అంశంలో బీజేపీ ప్ర‌భుత్వం త‌లొగ్గింద‌న్నారు. మోడీ ఛాతి 4 ఇంచులే అని చైనా వాళ్లు నిరూపించార‌ని రాహుల్ విమ‌ర్శించారు.క‌నీస ఆదాయం క‌ల్పిస్తామ‌ని త‌మ పార్టీ హామీ ఇచ్చింద‌ని, అంటే ప్ర‌తి పేద‌కు నేరుగా ల‌బ్ది చేకూరుతుంద‌ని రాహుల్ వివ‌రించారు.

ఇదిలాఉండ‌గా, రాజస్థాన్‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్ సైతం కేంద్రంపై స్పందించారు. దేశంలో అన్ని దర్యాప్తు సంస్థలు విశ్వసనీయత (క్రెడిబిలిటీ)ను కోల్పోయాయని  అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే నేతలు, నాన్ బీజేపీ నాయకులే లక్ష్యంగా వారిని అణచివేసేందుకు ఇన్‌కం ట్యాక్స్, ఈడీ, సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం అయ్యాయని సచిన్ పైలట్‌ ఆరోపించారు. ఈ రకమైన రాజకీయాలు మన దేశానికి సరిపోవని ఆయన అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English