కాంగ్రెస్‌లో కొత్త ట్రెండ్ఃనేనే ఎంపీ అభ్య‌ర్థిని

కాంగ్రెస్‌లో కొత్త ట్రెండ్ఃనేనే ఎంపీ అభ్య‌ర్థిని

పార్ల‌మెంటు ఎన్నిక‌లు స‌మీపిస్త‌న్న త‌రుణంలో....కాంగ్రెస్ పార్టీలో కొత్త ట్రంఎడ్ తెర‌మీద‌కు వ‌స్తోంది. ఇప్ప‌టికే, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైన కాంగ్రెస్ నేత‌లు పార్ల‌మెంటుపై క‌న్నేసి త‌మ క‌స‌ర‌త్తును చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కొత్త ట్రెండ్ వ‌స్తోంది. పార్టీ అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌కముందే...ప్ర‌క‌ట‌న అనే ప‌ర్వం జ‌ర‌గ‌కముందే...నేతలే స్వ‌యంగా త‌మ‌ను తాము అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించేంసుకుంటున్నారు. ఈ జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేరారు.

ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్ల అభినందన సభలో కోమటిరెడ్డి పాల్గొని మాట్లాడారు. సర్పంచ్‌గా ఓడిపోయిన వారు మనోధైర్యం కోల్పోవద్దన్నారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం గ్రామజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టి నిధులు మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు. అంతేకాకుండా కేంద్రం నుంచి గ్రామాలకు వచ్చే నిధులను కూడా పక్కదోవ పట్టించారని విమర్శించారు. గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్దికి నిధులు విడుదల చేయలేదని కోమటిరెడ్డి ఆరోపించారు.

త్వరలో నల్లగొండ ఎంపీగా పోటీచేస్తానని కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ప్ర‌క‌టించారు. న‌ల్గొండ నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత మీదేనని సూచించారు. నాకు పదవి ఉన్నా.. లేకున్నా.. ప్రజల మధ్యనే ఉంటూ వారి కోసమే పనిచేస్తానని తెలిపారు. గత ఇరవై సంవత్సరాలు నిజాయితీతో పని చేసినందునే ప్రజలు తనను గుర్తుంచుకున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల హామీలు ఇంకా అలాగే ఉన్నాయని, ఇప్పుడైనా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అన్నారు. పెంచిన పెన్షన్లను ఇప్పటి నుంచే అమలు చేయాలని, పేదలందరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కోమటిరెడ్డి అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English