సౌత్ లో క‌మ‌లం!... ఈ సారీ ఛాన్స్ లేద‌బ్బా!

సౌత్ లో క‌మ‌లం!... ఈ సారీ ఛాన్స్ లేద‌బ్బా!

కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చినా... క‌ల‌మ‌నాథుల‌కు ద‌క్షిణాదిన ఇప్ప‌టిదాకా పెద్ద‌గా ప‌ట్టు దొర‌క‌లేద‌నే చెప్పాలి. ఇదే భావ‌న‌తో చాలా కాలం నుంచి తీవ్ర క‌స‌రత్తులు చేస్తున్న బీజేపీ నేత‌లు... ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అయినా ద‌క్షిణాదిన స‌త్తా చాటాల్సిందేన‌ని దాదాపుగా ప్ర‌తిన‌బూనారు. అయితే క‌న్న‌డ‌నాట‌, త‌మిళ‌నాట ఆ పార్టీ వ్య‌వ‌హ‌రించిన తీరు కార‌ణంగా పార్టీ ప‌రిస్థితి మ‌రింత తీసిక‌ట్టుగా మారిపోయింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రో రెండు నెలల్లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేంద్రంలో అధికారం చేప‌ట్టే దిశ‌గానే సాగుతున్న బీజేపీ... ద‌క్షిణాదిన మాత్రం మ‌రోమారు ప‌రాభ‌వం త‌ప్పేలా లేదు. ద‌క్షిణాదిన ఈ సారి కూడా బీజేపీకి పెద్ద‌గా క‌లిసి రాక‌పోతుండ‌గా, గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ఏమైనా బ‌లోపేతం అవుతుందా? అని అనుకోవ‌డానికి లేదు.

ఎందుకంటే.. దక్షిణాదిన ఈ సారి ప్రాంతీయ పార్టీల హ‌వా చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌ధానంగా ఏపీలో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలోని వైసీపీ, తెలంగాణ‌లో క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ లు ఈ సారి హ్యాండ్ ఫుల్ సీట్ల‌ను సాధించడం ద్వారా ఇటు కాంగ్రెస్‌తో పాటు అటు బీజేపీకి కూడా గ‌ట్టి దెబ్బ‌నే కొట్ట‌నున్నాయి. అంతేకాకుండా కేంద్రంలో అధికారం చేజిక్కించుకునేంత స్థాయి ఆ పార్టీల‌కు లేకున్నా... కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డంలో మాత్రం కీల‌క భూమిక‌ను పోషించ‌నున్నాయి. ఈ వాస్త‌వాన్ని ఇప్ప‌టికే చాలా స‌ర్వేలు వెల్ల‌డి చేయ‌గా... తాజాగా విడుదైన *నేష‌న‌ల్ ట్రాక‌ర్ పోల్_2* పేరిట వీడీఏ అసోసియేట్స్ అనే సంస్థ వెల్ల‌డించిన స‌ర్వే కూడా ఇదే అంశాన్ని చెప్పింది.

ఇక గ‌త కొంత‌కాలంగా రాజ‌కీయ అస్థిర‌త నెల‌కొన్న త‌మిళ‌నాట మ‌రోమారు డీఎంకే స‌త్తా చాటి ఆ రాష్ట్రంలోని అత్య‌ధిక లోక్ స‌భ స్థానాల‌ను కొల్ల‌గొట్ట‌డం ద్వారా వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి త‌మిళ‌నాట బ‌ల‌మైన పార్టీగా అవ‌త‌రించ‌డ‌మే కాకుండా అధికారాన్ని చేజిక్కించుకునే అవ‌కాశాలున్నాయ‌ని ఈ స‌ర్వే తేల్చింది. ఇక దిక్షిణ భారతంలో మ‌రో కీల‌క రాష్ట్రమైన కేర‌ళ‌లోనూ ఈసారి కూడా అక్క‌డి స్థానిక పార్టీల‌దే హ‌వా. బీజేపీకి అక్క‌డ ఈ సారి ఓ మోస్త‌రు ఓటింగ్ శాతం పెర‌గ‌నుండ‌టం ఒక్క‌టే ఆ పార్టీకి ఊర‌ట‌గా క‌నిపిస్తోంది. రాష్ట్రంలోని మెజారిటీ సీట్ల‌ను యూడీఎఫ్ గెలుచుకోనుండ‌గా, ఎల్డీఎఫ్ కూడా ఓ మోస్త‌రు సీట్ల‌ను గెలుచుకోనుంది. ఇక ఇటీవ‌లే ఎన్నిక‌లు ముగిసి.. ఇంకా రాజ‌కీయంగా హాట్‌హాట్‌గా ఉన్న క‌న్న‌డ నాట మాత్రం బీజేపీకి కాస్తంత మంచి ఫ‌లితాలు ద‌క్క‌నున్నాయి. అయితే గ‌డ‌చిన ఎన్నికల్లో బీజేపీకి చుక్క‌లు చూపిన కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ ద‌ఫా క‌న్న‌డ నాట మంచి ఫ‌లితాలే రానున్నాయి. ఇక కింగ్ మేక‌ర్ అవుతుంద‌నుకున్న జేడీఎస్‌... అనూహ్యంగా కింగ్ సీటులో కూర్చున్నా... లోక్ స‌భ ఎన్నిక‌ల్లో మాత్రం సింగిల్ డిజిట్ కే ప‌రిమిత‌మ‌వుతుంద‌ట‌.

మొత్తంగా అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీల‌కు ద‌క్షిణ భార‌తం షాకివ్వ‌నుంద‌ని చెప్పాలి. అదే త‌రుణంలో ప్రాంతీయ పార్టీల హ‌వా ద‌క్షిణ భారతంలో మరింత‌గా పెర‌గ‌నుంద‌న్న మాట‌. ఇక గ‌ణాంకాల విష‌యానికి వ‌స్తే... ద‌క్షిణ భార‌త దేశంలో మొత్తం ఐదు రాష్ట్రాల(ఏపీ, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌)లో మొత్తం సీట్లు 130 ఉండ‌గా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూట‌మికి 59 సీట్లు ద‌క్క‌నుండ‌గా, బీజేపీ ఆధ్వ‌ర్యంలోని ఎన్డీఏ కూట‌మికి కేవ‌లం 14 సీట్లు ద‌క్క‌నున్నాయి. ఇక ఈ రెండు కూట‌ముల‌కు షాకిచ్చే దిశ‌గా ప్రాంతీయ పార్టీల‌కు 57 సీట్లు ద‌క్క‌నున్నాయి. ఓట్ల శాతాన్ని తీసుకున్నా... యూపీఏకు కేవ‌లం 18 శాతం ఓట్లు ద‌క్క‌నుండ‌గా... అటు యూపీఏతో పాటు ప్రాంతీయ పార్టీల‌కు స‌రిస‌మానంగా 41 శాతం మేర ఓట్లు ద‌క్క‌నున్నాయి. ఇక రాష్ట్రాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు ద‌క్క‌నున్నాయ‌న్న విష‌యానికి వ‌స్తే..

ఏపీ 45

వైసీపీ 21
టీడీపీ 4

తెలంగాణ 17

టీఆర్ఎస్ 14
కాంగ్రెస్ 2
ఎంఐఎం 1

కేర‌ళ 20

యూడీఎఫ్ 17
ఎల్డీఎఫ్ 3

త‌మిళ‌నాడు 39

అన్నాడీఎంకే 9
డీఎంకే  18
కాంగ్రెస్ 2
బీజేపీ 1
పీఎంకే 1

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English