బీజేపీపై జ‌ర్న‌లిస్టుల నిర‌స‌న చూశారా?

బీజేపీపై జ‌ర్న‌లిస్టుల నిర‌స‌న చూశారా?

రాజ‌కీయ నాయ‌కుల‌తో మాట్లాడేందుకు, వారి కార్య‌క్ర‌మాల‌ను క‌వ‌ర్ చేసేందుకు సాధార‌ణంగా జ‌ర్న‌లిస్టులు త‌మ వెంట ఏం తీసుకెళ్తుంటారు? కెమెరాలు, మైకులు, నోట్ పుస్త‌కాలు, పెన్నులు.. ఇవే క‌దా..! ఛ‌త్తీస్ గ‌ఢ్ రాజ‌ధాని రాయ్ పూర్ లో మాత్రం కొంద‌రు విలేక‌రులు ఓ కార్య‌క్ర‌మానికి హెల్మెట్ల‌తో వెళ్లారు. వాటిని ధ‌రించే అక్క‌డి విలేక‌ర్ల‌తో మాట్లాడారు. ఎందుకో తెలుసా.. నిర‌స‌న‌!

ఛ‌త్తీస్ గ‌ఢ్ లో గ‌త శ‌నివారం సుమ‌న్ పాండే అనే జ‌ర్న‌లిస్టు ఓ మీడియా స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. అక్క‌డ బీజేపీ నేత‌ల మ‌ధ్య ఓ విష‌యంపై గొడ‌వ చెల‌రేగింది. వారిలో వారే ఘ‌ర్ష‌ణ ప‌డ్డారు. ఆ ఘ‌ట‌న‌ను పాండే ఫోన్ లో రికార్డు చేశాడు. దీంతో వీడియోను డిలీట్ చేయాలంటూ బీజేపీ నేత‌లు ఆయ‌న‌పై ఒత్తిడి చేశారు. పాండే లెక్క‌చేయ‌క‌పోవ‌డంతో ఆయ‌న‌పై దాడికి తెగ‌బ‌డ్డారు. ఆయ‌న త‌ల‌కు గాయ‌మైంది. ఆపై ఫోన్ ను లాక్కొని త‌మ ఘ‌ర్ష‌ణ వీడియోను బ‌ల‌వంతంగా డిలీట్ చేశారు. ఈ ఘటనపై విలేకరులు ఆందోళన చేపట్టారు. బాధ్యులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. పాండే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన నేతలను అరెస్టు చేశారు.
 
అయితే - జ‌ర్న‌లిస్టుల ఆగ్ర‌హం చ‌ల్లార‌లేదు. బీజేపీపై నిర‌స‌న కొన‌సాగించాల‌ని వారు నిర్ణ‌యించుకున్నారు. అందుకే రాయ్ పూర్ లో స్థానిక బీజేపీ నేతలు నిర్వహించిన కార్యక్రమానికి జ‌ర్న‌లిస్టులు హెల్మెట్లు పెట్టుకుని వచ్చారు. క‌మ‌ల‌ద‌ళం నాయ‌కులు త‌మ‌పై దాడి చేసినా దెబ్బ‌లు త‌గ‌ల‌కుండా ఉండేందుకే ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా హెల్మెట్లు పెట్టుకొని వ‌చ్చామ‌ని వారు వెల్ల‌డించారు. ఇప్ప‌టికే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ర‌మ‌ణ్ సింగ్ ప్ర‌భుత్వం ప‌డిపోయిన నేప‌థ్యంలో.. సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న‌వేళ జ‌ర్న‌లిస్టుల‌తో ఘ‌ర్ష‌ణ బీజేపీకి ఎదురుదెబ్బేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English