పవన్‌ కళ్యాణ్‌కీ సేమ్‌ తలపోటు!

పవన్‌ కళ్యాణ్‌కీ సేమ్‌ తలపోటు!

స్టార్‌ హీరో రాజకీయ రంగంలోకి వచ్చి సొంతంగా పార్టీ పెడితే అభిమానులే కార్యకర్తలవుతారు. వారిలో చాలా మంది నిస్వార్ధంగా పార్టీ జెండాలు మోస్తూ హీరోకి వెన్నుదన్నుగా నిలిస్తే, కొందరు మాత్రం అభిమానుల హోదాలో ఆయా ప్రాంతాల నుంచి టికెట్లు ఆశిస్తారు. అయితే ఎవరికి పడితే వారికి టికెట్టు ఇచ్చేసి ఎన్నికలలో నిలబెట్టేయడం ప్రాక్టికల్‌గా జరగని పని. అయితే అలా టికెట్‌ ఆశించిన అభిమానులు ఎప్పుడయితే తమకి ఆ అవకాశం లేదని తెలుసుకుంటారో ఇక పార్టీకే ఎదురు తిరుగుతారు. నిస్వార్ధంగా పని చేసిన వారికి ఇక్కడ చోటు లేదంటూ అభిమానుల ముసుగులోనే బురద జల్లడం షురూ చేస్తారు.

ప్రజారాజ్యం టైమ్‌లో చిరంజీవి ఇలాంటివి బాగా ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌కి కూడా ఈ బెడద, బురద తప్పడం లేదు. అక్కడికీ ఆచి తూచి అడుగులేస్తూ, ప్రతి విషయంలోను చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోన్న పవన్‌కళ్యాణ్‌ ఫాన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ రీచ్‌ అవలేకపోతున్నాడు. అసలే సంస్థాగతంగా ఇంకా స్థిరత్వం సంపాదించని పార్టీ కావడంతో ఇలాంటి 'రెబల్స్‌' వల్ల మరింత పలుచన అవుతోంది. ఎన్నికల సమయానికి ఇలాంటి రెబల్స్‌ని ఎలా అదుపులో పెట్టుకుంటారనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English