శ్రీనివాసన్‌.. సిగ్గేయడంలేదా?

శ్రీనివాసన్‌.. సిగ్గేయడంలేదా?

రాజకీయాల్లో నైతిక విలువల గురించి మాట్లాడని వారుండరు, అలాగే వాటిని పాటించేవారూ ఉండరంటారు. అదే రాజకీయం. రాజకీయం బిసిసిఐ మీదనా పనిచేస్తున్నది కొన్నేళ్ళ నుంచి. ఆ రాజకీయమే క్రికెట్‌ని అభాసుపాలు చేస్తోందనే విమర్శలు కోకొల్లలు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ గొడవ బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కి చుట్టుకోగా, ఆయన తనకు ఏ పాపమూ ఎరుగదని తప్పించుకోజూస్తున్నారు. కాని, ఆయన అల్లుడే స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతంలో అరెస్టయ్యేసరికి శ్రీనివాసన్‌పై ఒత్తిడి పెరుగుతున్నది.

నిన్న జరిగిన ఐపిఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం ప్రెజెంటేషన్‌ సెర్మనీలో బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ పేరు విన్పించగానే క్రికెట్‌ అభిమానులు అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘రాజీనామా చేయాలి’ అని నినదించేసరికి శ్రీనివాసన్‌ బిక్కచచ్చిపోయారు. కాని ఇప్పటిదాకా రాజీనామా చేస్తానని చెప్పడంలేదాయన. ‘శ్రీనివాసన్‌.. సిగ్గేయడంలేదా, రాజీనామా చెయ్‌ అని క్రికెట్‌ అభిమానులు నినదించినా పట్టించుకోవడంలేదంటే ఆ పదవిపై ఆయనకెంత మోజు అనేది అర్థమవుతున్నది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు