ఉత్త‌మ్ ప‌ద‌వి ఊడ‌టం ఖాయ‌మ‌న్న‌ట్లేనా?

ఉత్త‌మ్ ప‌ద‌వి ఊడ‌టం ఖాయ‌మ‌న్న‌ట్లేనా?

తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ హాట్ చ‌ర్చ జ‌రుగుతోంది. పార్టీలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకోవ‌చ్చున‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. తాజా ప‌రిణామాల ఆధారంగా ఈ మాట చెప్తున్నారు. తెలంగాణ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోర‌ ఓటమి తర్వాత మొదటిసారి కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. పార్టీ ఓటమికి గల కారణాలు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై చర్చించారు.  రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశాలపై ఈ సమావేశంలో రాహుల్ గాంధీతో విపులంగా చ‌ర్చించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి, పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించే వ్యూహాంపై ఢిల్లీలోని వార్‌ రూంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో రాహుల్‌గాంధీ సమావేశం అయ్యారు. ఈ భేటీకి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ రామచంద్ర కుంతియా, టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌ రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లి ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు వివరించారు. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తే తప్ప అధికార తెరాసాను ధీటుగా ఎదుర్కోలేమని తక్షణమే పార్టీలో మార్పులు, చేర్పులు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యనేతలు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కోరారు. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్నా వారిని నడిపించే నాయకత్వం రాష్ట్రంలో లేదని, ఇందువల్లే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాల‌య్యామని రాహుల్‌గాంధీతో జరిగిన సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా మించిపోయింది లేదని పార్టీ నాయకత్వంలో కొత్త నీరు తీసుకురా వాలని, త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో యువరక్తాన్ని నింపి వారిని అభ్య ర్థులుగా ఎంపిక చేయాలని రాహుల్‌ గాంధీని కోరినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ ర‌థ‌సార‌థితో జ‌రిగిన చ‌ర్చ స‌మ‌యంలో, అనంత‌రం మీడియాతో మాట్లాడిన స‌మ‌యంలో కూడా ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ నాయకత్వంలో మార్పులు జరిగితేనే భవిష్యత్‌ ఉంటుందని తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నిక ల్లో పార్టీ విజయం కోసం ఐక్యంగా పని చేస్తామని చెప్పా రు. దీంతో రాహుల్‌గాంధీ స్పందిస్తూ వీటన్నింటిపై త్వ రలో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఓట‌మికి బాధ్యుడిగా పీసీసీ చీఫ్‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English