మ‌ధ్య త‌ర‌గతి ఓట్ల‌న్నీ మోదీకే!... కార‌ణాలివిగో!

మ‌ధ్య త‌ర‌గతి ఓట్ల‌న్నీ మోదీకే!... కార‌ణాలివిగో!

మ‌రో మూడు నెల‌ల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నెల‌లోనే దీనికి సంబంధించి నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుండ‌గా... ఎన్నిక‌ల వేడి ఇప్ప‌టికే రాజుకుంది. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్న ఆయా రాజ‌కీయ పార్టీలు ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు బాగానే కృషి చేస్తున్నాయి. ఈ రోజు ఒక పార్టీ ఒక హామీ ఇస్తే... ఆ మ‌రునాడే ఆ పార్టీ ప్ర‌త్య‌ర్థి పార్టీ ఆ హామీకి మించి అన్న‌ట్గుగా మ‌రో ఆస‌క్తిక‌ర హామీని ప్ర‌క‌టించేస్తున్నాయి. ఇందులో ఉచిత హామీలు గుట్ట‌లుగా వ‌చ్చి ప‌డుతున్నాయి. ఈ హామీల‌న్నింటినీ ప‌క్క‌న‌పెడితే... నేటి ఉద‌యం పార్ల‌మెంటు ముందుకు వ‌చ్చిన కేంద్ర మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్ తో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మాయ చేశార‌నే విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. దేశ జ‌నాభాలో మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లదే సింహ భాగం. ఓట్ల‌లోనూ వారి ఓట్లే కీల‌కం. ఈ వాస్త‌వాన్ని మ‌రోమారు గుర్తించిన మోదీ... మ‌ధ్య త‌ర‌గ‌తిని కట్టేసుకుంటే... వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న గెలుపున‌కు తిరుగు లేద‌ని భావించారు. ఇంకేముంది... ఆర్థిక శాఖ‌ను త‌న ప్రాధ‌మ్యాల చిట్టాను ఇచ్చేసిన మోదీ... వాటిని అమ‌లు చేసే విధంగా బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న‌కు ఆదేశాలు జారీ చేశారు. మోదీ ఆదేశాలకు అనుగుణంగా రూపొందిన ఇంటెరిమ్ బ‌డ్జెట్... విన‌డానికి మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌గానే క‌నిపిస్తున్నా... త‌ర‌చిచూస్తే మాత్రం వార్షిక బ‌డ్జెట్‌నే త‌ల‌పిస్తోంది.

పార్ల‌మెంటులో బ‌డ్జెట్ ప్ర‌సంగం పూర్తి అయిన నేప‌థ్యంలో బ‌డ్జెట్ లో ఏమేమున్నాయి? ఆయా అంశాల‌తో ఏఏ వ‌ర్గాల‌కు ఎంత‌మేర ప్ర‌యోజనం ఉంటుంది?  ముఖ్యంగా ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఈ బ‌డ్జెట్... మోదీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఏ మేర విజ‌యావ‌కాశాలున్నాయి? అన్న విష‌యంపై ఇప్పుడు చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో అన్నింటికంటే ప్ర‌ధానంగా వినిపిస్తున్న విశ్లేష‌ణ‌గా మ‌ధ్య‌త‌ర‌గ‌తి మంత్ర‌మే ప‌రిగ‌ణించాలి. నెల‌ల వ్య‌వ‌దిలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో గెలుపు ద‌క్కాలంటే... మిడిల్ క్లాస్ ఓట్లలో మెజారిటీ ద‌క్కాల్సిందే. ఈ మిడిల్ క్లాస్ మెజారిటీ కోస‌మే త‌న‌దైన మంత్రాన్ని ప‌ఠించారు. మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ఓట్ల‌ను గంప‌గుత్త‌గా త‌న ఖాతాలో వేసుకునేందుకు మోదీ ఈ ఇంటెరిమ్ బ‌డ్జెట్ నే ఆశ్ర‌యించారు. మ‌రి ఇందులో ఏఏ అంశాలున్నాయ‌న్న విష‌యానికి వ‌స్తే...

1. ఆదాయ ప‌న్ను ప‌రిమితి ఏకంగా రూ.5 ల‌క్ష‌ల‌కు పెంపు
2. భ‌విష్య నిధి, ఇత‌ర నిర్దేశిత ప‌థ‌కాల్లో పెట్టుబ‌డి పెడితే... ఈ పరిమితి రూ.6.5 ల‌క్ష‌ల దాకా పెంపు
3. అద్దెపై ఆదాయ ప‌న్ను ప‌రిమితి రూ.2.4 ల‌క్ష‌ల‌కు పెంపు
4. ఇళ్ల నిర్మాణంపై సెక్ష‌న్ 80 కింద వ‌ర్తించే ప్ర‌యోజ‌నాలు మ‌రో ఏడాది దాకా కొన‌సాగింపు
5. రెండో గృహంపై ప‌న్ను విధింపుపై రెండేళ్ల దాకా మిన‌హాయింపు
6. ఉద్యోగుల టీడీఎస్ ప‌రిధి రూ.40 వేల నుంచి రూ.50 వేల‌కు పెంపు
7. బ్యాంకు డిపాజిట్లు, పోస్టాఫీస్ డిపాజిట్ల‌పై వ‌చ్చే వ‌డ్డీపై ప‌న్ను మిన‌హాయింపు రూ.10 వేల నుంచి రూ.40 వేల‌కు పెంపు
8. గ్రాట్యూటీని ఇప్పుడున్న రూ.10 ల‌క్ష‌ల నుంచి ఒకేసారి రూ.30 ల‌క్ష‌ల‌కు పెంపు
9. అసంఘ‌టిత రంగ కార్మికుల‌కు 60 ఏళ్ల త‌ర్వాత రూ.3 వేల ఫెన్షన్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English