కే ఏ పాల్..... కాదు కామెడీ ఆనంద్ పాల్

కే ఏ పాల్..... కాదు కామెడీ ఆనంద్ పాల్

కే ఏ పాల్. మత ప్రబోధకుడు. దాదాపు 150 దేశాల్లో అతిరథ మహారథులకు ప్రార్థనలు చేసి పెట్టినవాడు. ఏకంగా చార్టెడ్ ఫ్లైట్ లో ఉదయం ఒక దేశంలోనూ, మధ్యాహ్నం మరో దేశంలోనూ, సాయంత్రం ఇంకో దేశంలోనూ కనిపించిన వాడు. వివిధ దేశాల అధ్యక్షులు, ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారులు, కళాకారులు, గాయకులు వీరంతా కే ఏ పాల్ శిష్యగణం. ఆయన రాక కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూసిన అతిరథమహారధులు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో మారుమూల పల్లెటూరిలో పుట్టిన కే ఏ పాల్ ప్రఖ్యాత మతబోధకుడుగా ఎదిగారు. రెండు దశాబ్దాల పాటు ఆయన యాత్ర కొనసాగింది. ఆరేడేళ్ల నుంచి కే ఏ పాల్ జీవితం మారిపోయింది. మత బోధకుడు కాస్త రాజకీయ చట్రంలో ఇరుక్కు పోయారు. ఇదిగో ఇప్పుడు తెలుగు టీవీ చానళ్లకు ఓ కామెడీ రాజకీయ నాయకుడిగా మారిపోయారు. దీంట్లో ఛానల్ లో తప్పు ఎంతుందో పాల్ అత్యుత్సాహం కూడా అంతే ఉంది తననుదెబ్బ కొట్టిన రాజకీయ నాయకులను ఎదుర్కొనేందుకు ప్రజా శాంతి పేరుతో రాజకీయ పార్టీని పెట్టారు కెఎ పాల్. రాజకీయమంటే మత ప్రబోధం కాదని కె పాల్ కు తెలియలేదు.

దీంతో ఆయన ఏం మాట్లాడినా అదో కామెడీ షో గానే మిగులుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 35 శాతం ఓట్లు ఇప్పటికే తమ ఖాతాలో పడ్డాయని, 75 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తామని చర్చాగోష్టులో కె పాల్ చెబుతున్నారు. ఇది అపార రాజకీయ అనుభవం ఉన్న పార్టీలకు, వారిని చూసిన ప్రజలకు నవ్వు తెప్పిస్తోంది. అంతేనా ప్రతి నియోజకవర్గాన్ని 100 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తాం అంటూ పాల్ ప్రకటిస్తున్నారు. నిధులు ఎక్కడ నుంచి వస్తాయి అన్న ప్రశ్నకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన శిష్యులు ఆ నిధులను సమకూరుస్తారని చెబుతున్నారు. నేటి సీనియర్ నాయకులు అందరూ ఒకప్పుడు తన శిష్యులే నని, వారిలో సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారని చర్చాగోష్టిలో పాల్ చెబుతున్నారు. ఈ చర్చల ద్వారా కామేడిని పండించి తమ రేటింగ్ పెంచుకోవాలని చానళ్లు కె ఎ పాల్ ను స్టూడియోకి తీసుకు వస్తున్నాయని అంటున్నారు. తనను వాడుకుంటున్నారని చెప్పినా అర్దం కాని కె ఎ పాల్ ముందు ముందు ఇంకా ఎలా ప్రవర్తిస్తారో అంచన వేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English