టార్గెట్ బాబుః మోడీ-షా ఏపీ టూర్‌

టార్గెట్ బాబుః మోడీ-షా ఏపీ టూర్‌

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కొద్దిరోజుల ముందు ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకోనుంది. కేంద్ర ప్ర‌భుత్వం నిర‌స‌న గ‌ళం అంటూ ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఇటీవ‌లి కాలంలో పోరాట పంథా ఎత్తుకోగా...ఆయ‌న్ను టార్గెట్ చేస్తూ బీజేపీ సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా ఏపీ పర్యటన ఖరారు అయ్యింది. బీజేపీ ర‌థ‌సార‌థుల ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఏపీలో మ‌రింత రాజ‌కీయ వేడి జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే కేంద్రం ఏపీకి మొండి చెయ్యిఇచ్చింది, ఏపీని మోసం చేసిందని, అవకాశం వచ్చినప్పుడల్లా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 13 వ తేదీ వరకు వివిధ రూపాలలో రాష్ట్రం తరపున నిరసనలు వ్యక్తం చేయాలని బుధవారం ప్రణాళికలు రూపోందించారు.  11న ఢిల్లీలో ఆందోళన చేపట్టి, 12న రాష్ట్రపతి దగ్గరకు అఖిల పక్ష నేతలను తీసుకువెళ్ళనున్నారు. ఇదే స‌మ‌యంలో, ఏపీలో బీజేపీ నాయ‌కులు త‌మ ప‌ర్య‌ట‌న‌ను ఖ‌రారు చేసుకున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఫిబ్రవరిలో ఏపీలో పర్యటించనున్నారని తెలిపారు. ఫిబ్రవరి 10న గుంటూరు, 16న విశాఖపట్నంలో మోడీ పర్యటిస్తారని కన్నా చెప్పారు. ఫిబ్రవరి 4న విజయనగరం, 21న రాజమండ్రి, 26న ఒంగోలులో అమిత్‌షా పర్యటించనున్నారని ఆయన తెలిపారు. ఏపీలో మోడీ, అమిత్ షా  పర్యటనలో భాగంగా కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, పధకాలు వివరించే అవకాశం ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English