జగన్ తర్వాత సెకండ్ హయ్యెస్ట్… వైసీపీకి జీరో స్పందన ఎందుకిలా?

ఆ ఎమ్మెల్యే సీఎం జగన్ తర్వాత అత్యంత మెజార్టీతో విజయం సాధించారు. దీన్ని బట్టి సహజంగా మనం అక్కడ వైసీపీకి బలమైన పునాదులున్నాయని అనుకుంటాం. పార్టీకి బలమైన కేడర్ ఉంది అనుకుంటాం. కానీ అక్కడ సీన్ రివర్స్ అయ్యింది.

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ముతుమల అశోక్‌రెడ్డిపై  వైసీపీ అభ్యర్థి అన్న రాంబాబుపై అక్షరాల 81520 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జగన్ తర్వాత వైసీపీకి అత్యధిక మెజారిటీ వచ్చింది ఇక్కడే. ఇలాంటి చోట టీడీపీకి వ్యతిరేకంగా ప్రజాగ్రహ దీక్ష నిర్వహిస్తే భారీ స్పందన సంగతి తర్వాత.. అసలు సగం కుర్చీలు కూడా నిండలేదు. జనం లేక వెలవెల పోయింది. దీక్ష కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. కానీ పట్టుమని పదిమంది కూడా దీక్షలో పాల్గొన లేదు. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

https://www.youtube.com/watch?v=OUEAkwdjq2A

టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై జరిగిన దాడులకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. పోటీగా అధికార పార్టీ నేతలు కూడా ప్రజాగ్రహ దీక్ష చేపడుతున్నారు. ఈ దీక్షలకు కొన్ని ప్రాంతాల్లో మద్దతు వస్తోంది. కానీ చాలా ప్రాంతాల్లో జనం లేక వేదికలు బోసిపోతున్నాయి. మిగతా చోట్ల సరే. కానీ ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం భారీ మెజార్టీ వచ్చిన చోట ఇలా ఎందుకు జరిగిందని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

అక్కడి ఎమ్మెల్యే తీరే దీనికి కారణమా? లేక ప్రజల్లో మార్పు వచ్చిందా? లేకపోతే ప్రజాగ్రహ దీక్ష కాదు అది వైసీపీ రాజకీయ దీక్ష అని ప్రజలు అనుకున్నారా అన్నది తెలియడం లేదు. దీక్షలో ఖాళీ కుర్చీలు కనిపించడంతో పార్టీ నేతలు ఇన్ సల్ట్ గా ఫీలయ్యారు. ఈ కార్యక్రమ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.