కోట్ల చేరిక‌...టీడీపీలో చీలిక‌!

కోట్ల చేరిక‌...టీడీపీలో చీలిక‌!

తెలుగుదేశం పార్టీలో చేరిక‌ల ప‌ర్వం కొత్త మ‌లుపులు తిరుగుతోంది. ఇత‌ర పార్టీల‌కు చెందిన ముఖ్య‌నేత‌లు త‌మ కండువా క‌ప్పుకోవ‌డం ఆ పార్టీ చెందిన నేత‌లువిభిన్న రీతిలో స్పందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి చేరడం లాంచ‌నం అనే సంగ‌తి తెలిసిందే. ఎందుకంటే,నాలుగు రోజులుగా టీడీపీ నేతలు కోట్లతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. సోమ‌వారం సాయంత్రం కోట్ల కుటుంబం సీఎం చంద్రబాబుతో భేటీ అవుతుంది. సోమ‌వారం రాత్రి కోట్ల కుటుంబానికి సీఎం చంద్రబాబు విందు ఇస్తున్నారు.

మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి టీడీపీలో చేరడంపై ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి స్పందిస్తూ ఆయ‌న చేరిక‌ను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేశారని, ఆయన కుమారుడు సూర్యప్రకాష్‌రెడ్డి చేరిక ప్రభావం రాష్ట్రమంతా ఉంటుందన్నారు. అయితే, ఏపీ ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి దీనికి భిన్నంగా స్పందించారు. కోట్ల కుటుంబీకులు తెలుగుదేశం పార్టీ లో చేరే విషయంపై త‌నకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఈ విషయంలో త‌న పేరుతో వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణ‌మూర్తి పేర్కొన్నారు. కాగా కేఈ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో టీడీపీలో ఉన్న అసంతృప్తులు బ‌య‌ట‌డప‌డుతున్నాయని అంటున్నారు.

కాగా, గ‌త కొద్దికాలంగా పార్టీ తీరుపై కోట్ల  సూర్య‌ప్ర‌కాష్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. నంద్యాలలో కాంగ్రెస్ ఆఫీస్ ప్రారంభానికి గైర్హాజరవుతున్నారు. ఆఫీస్ ప్రారంభం వాయిదా వేసుకోవాలని పిసిసి చీఫ్ రఘువీరారెడ్డికి సూచించినా అంగీకరించకపోవడంతో  కోట్ల మరింత అసంతృప్తి గురయ్యారు. దాంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన ఒత్తిడిలో పడిన కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English