గ‌వ‌ర్న‌ర్‌-కేసీఆర్ గంట‌న్నర ఇవే ముచ్చ‌టించుకున్నారా?

గ‌వ‌ర్న‌ర్‌-కేసీఆర్ గంట‌న్నర ఇవే ముచ్చ‌టించుకున్నారా?

గవర్నర్ నరసింహన్ గణతంత్ర దినోత్సవం సంద‌ర్భంగా శనివారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఎట్‌హోం కార్యక్రమం అనేక ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాల‌కు వేదిక‌గా మారింది. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొదట తెలంగాణ రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీ రామారావు ఆయనతో కాసేపు ముచ్చటిం చారు.

అనంతరం రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కె.చంద్రశేఖర రావుకు శుభాభినందనలు తెలిపిన పవన్‌ ఆయన పక్కనే కూర్చుని దాదాపు 20 నిమి షాల పాటు ఏపీ రాజకీయాలపై చర్చించుకున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లి ఎన్నికలు, త్వరలో ఏపీలో జరగనున్న శాసనసభ ఎన్నికలపైనా ఈ ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటా యన్న కోణంలోనూ సీఎం కేసీఆర్‌ ఏపీ రాజకీయాలపై ఆరా తీసినట్టు సమాచారం.

ఈ కార్యక్రమం తర్వాత రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య గంటన్నరపాటు సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలిసింది. చండీయాగం విజయవంతం కావడం, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తుది అటవీ అనుమతులు రావడం, అటవీ నేరాలను అదుపుచేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల విషయాలను సీఎం గవర్నర్‌కు వివరించినట్టు సమాచారం.

మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చ జరిగినట్టు తెలిసింది. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు ఘన విజయం సాధిస్తుండటం, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకగ్రీవంగా సర్పంచ్‌లు ఎన్నికవడం, వారికి తగిన ప్రోత్సాహం వంటి అంశాలను సీఎం గవర్నర్‌కు వివరించినట్టు సమాచారం. ప్ర‌ధానంగా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ గురించి చ‌ర్చుకు వచ్చినట్లు స‌మాచారం. ఫిబ్ర‌వ‌రీలో ముహుర్తం గురించి గ‌వ‌ర్న‌ర్‌కు కేసీఆర్ వివ‌రించార‌ని స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English