ట్రంప్ ట్విస్ట్ఃవివాదానికి ఫుల్‌స్టాప్‌ కాదు...కామా పెట్టానంతే!

ట్రంప్ ట్విస్ట్ఃవివాదానికి ఫుల్‌స్టాప్‌ కాదు...కామా పెట్టానంతే!

మొండి ఘ‌టం అనే పేరున్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోమారు త‌న క‌ఠిన వైఖ‌రి ఎలా ఉంటుందో రుచి చూపించాడు.  గోడ నిర్మాణానికి 570 కోట్ల బిలయన్ డాలర్లు కేటాయించాలని ట్రంప్ పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఇందుకు డెమోక్రాట్లు అంగీకరించడం లేదు. ఇది ప్రభుత్వ షట్‌డౌన్‌కు దారితీయడంతో దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతాల్లేక అవస్థలు పడుతున్నారు. దాదాపు నెల‌న‌ర రోజులుగా  అమెరికా చరిత్రలోనే రికార్డు స్థాయిలో కొనసాగుతున్న ప్రభుత్వ షట్‌డౌన్‌కు తాత్కాలికంగా ట్రంప్‌ తెరదించారు. అయితే, త‌న డిమాండ్ ఇంకా నెర‌వేర‌లేద‌ని..తాను మ‌ళ్లీ ష‌ట్‌డౌన్ విధిస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

రాజకీయ ఒత్తిడికి తలొగ్గిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి నిధులు సాధించలేకపోయినప్పటికీ ప్రభుత్వాన్ని తాత్కాలికంగా మళ్లీ తెరిచేందుకు అంగీకరించారు. మరోవైపు సరిహద్దు భద్రతపై చర్చలు ప్రారంభించాలంటే ముందు ప్రభుత్వాన్ని తెరవాలని డెమోక్రాట్లు హౌస్‌లో డిమాండ్ చేశారు. గురువారం కుదిరిన ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 15 వరకు ప్రభుత్వానికి నిధులు అందుతాయి. ఇందుకు సంబంధించిన ప్లాన్‌కు ప్రతినిధుల సభ, సెనేట్ ఆమోదం తెలుపగా, అనంతరం ట్రంప్ కూడా దీనిపై సంతకం చేశారని శ్వేతసౌధం వెల్లడించింది. ఈ సమయంలో వలస విధానంపై విస్తృత ఒప్పందంపై చట్టసభ సభ్యులు చర్చించనున్నారు.  కాగా, షట్‌డౌన్ ముగింపునకు సంబంధించిన రెండు బిల్లులను గురువారం సెనేట్ తిరస్కరించింది.

తాజా ఒప్పందాన్ని ట్రంప్ ఓటమిగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అత్యవసర పరిస్థితి విధించి అయినా గోడ నిర్మిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. ``సరిహద్దు గోడ నిర్మించడం తప్ప మనకు మరో మార్గం లేదు. దీనిపై కాంగ్రెస్ సరైన ఒప్పందానికి రాకపోతే ఫిబ్రవరి 15న మళ్లీ షట్‌డౌన్ విధించేందుకు నేను సిద్ధమే. అవసరమైతే అత్యవసర పరిస్థితి విధిస్తా` అని ట్రంప్ హెచ్చరించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English