మోడీ మాస్ట‌ర్ స్ట్రోక్.. ప్ర‌ణ‌బ్ దాకు భార‌త‌ర‌త్న‌!

మోడీ మాస్ట‌ర్ స్ట్రోక్.. ప్ర‌ణ‌బ్ దాకు భార‌త‌ర‌త్న‌!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మ‌రో మూడు నెల‌ల స‌మ‌యం ఉన్న వేళ‌.. త‌న‌కున్న ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌ద‌ల‌కుండా.. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు షాకిచ్చే నిర్ణ‌యాల్ని తీసుకుంటున్నారు మోడీ. తాజాగా అలాంటిదే మ‌రో నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. జ‌న‌వ‌రి 26 రిప‌బ్లిక్ డేను పుర‌స్క‌రించుకొని దేశ అత్యున్న‌త పుర‌స్కారమైన భార‌త‌ర‌త్న‌ను కర‌డు క‌ట్టిన కాంగ్రెస్ వాదిగా పేరున్న మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి ఇవ్వ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

స‌రిగ్గా ఎన్నిక‌ల ముందు మోడీ మాస్ట‌ర్ స్ట్రోక్ గా ఈ నిర్ణ‌యాన్ని ప‌లువురు అభివ‌ర్ణిస్తున్నారు. ప్ర‌ణ‌బ్ దా లాంటి కాంగ్రెస్ వాదికి.. ఆ పార్టీ నీడ అంటేనే ప‌డ‌ని బీజేపీ ప్ర‌భుత్వం.. భార‌త‌ర‌త్న పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించ‌టం సంచ‌ల‌నంగా మారింది. అయితే.. ఈ నిర్ణ‌యం వెనుక అస‌లు కార‌ణం వేరని చెబుతున్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ‌బెంగాల్ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచుకునేందుకు వీలుగా భార‌త‌ర‌త్న పుర‌స్కార ప్ర‌క‌ట‌న చేసి ఉంటార‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ విశ్లేష‌ణ‌ ఎలా ఉన్నా.. ఒక రాజ‌కీయ ప్ర‌ముఖుడి నేతృత్వం వ‌హించిన పార్టీకి బ‌ద్ధ‌విరోధి అయిన పార్టీ ప్ర‌భుత్వంలో భార‌త‌ర‌త్న పుర‌స్కారం ప్ర‌దానం చేయ‌టం మోడీ స‌ర్కారుకు భారీ మైలేజీగా మార‌టం ఖాయం. తాజా నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మార‌టమే కాదు.. రాజ‌కీయ వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ‌కు తావిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English