'అమ్మ' దయ చూపలేదాయె

'అమ్మ' దయ చూపలేదాయె

ఢిల్లీలో తెలంగాణ కోసం రెండు దీక్షలు జరిగాయి. ఒక దీక్ష ముగిసిపోగా, ఇంకొకటి బుధవారం ముగిసిపోతుంది. తెలంగాణ జెఎసి ఢిల్లీలో దీక్ష చేపట్టగా బిజెపి దానికి మద్దతునిచ్చింది. ఈ దీక్షలో అందరూ కాంగ్రెసు పార్టీని వివిధ రకాలుగా తిట్టి పోశారు. దీక్ష ముగిసిన అనంతరం ర్యాలీగా పార్లమెంటు వైపుకు ఆందోళనకారులు వెళ్ళగా, వారిని పోలీసులు నిలువరించారు. ఇంత జరిగినా అధికార పార్టీ నుంచి తెలంగాణకు అనుకూలంగా ఎవరూ మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. 

పోని తెలంగాణ జెఎసిని అలా గాలికి వదిలేసినా, పార్లమెంటు ఆవరణలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెసు ఎంపీలు ఐదుగురు దీక్ష చేస్తున్నారు కదా, వారినైనా బుజ్జగించలేదెందుకో కాంగ్రెసు పార్టీ అన్నది అర్థంకాని ప్రశ్న. అమ్మ సోనియమ్మ ఈ రెండు దీక్షలనూ అస్సలు పట్టించుకోలేదు, దయ చూపలేదు. ఆమె తలచుకుంటేనే తెలంగాణ అంశానికి పరిష్కారం వస్తుంది. తెలంగాణ అంశం రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నా ఆ సమస్యపై సోనియమ్మకు ఎందుకు అంత చిన్న చూపో తెలియడంలేదు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English