ఉత్త‌మ్ గ‌డ్డంపై ఎంఐఎం ఎమ్మెల్యే సెటైర్లు

ఉత్త‌మ్ గ‌డ్డంపై ఎంఐఎం ఎమ్మెల్యే సెటైర్లు

తెలంగాణ పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన స‌వాల్ ఇప్పుడు ఆయ‌న‌పై సెటైర్లు వేసే స్థాయికి చేరింది. ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వ‌చ్చేవ‌ర‌కు తాను గ‌డ్డం తీయ‌బోన‌ని ఉత్త‌మ్ బీక‌ర స‌వాల్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ గెలవలేదు.. ఆయన గడ్డం తీయలేదు.  

ఆ గ‌డ్డంపై అనేక‌మంది అనేక ర‌కాల సెటైర్లు వేశారు. ప్ర‌ధానంగా టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే అనేకసార్ల‌ గడ్డం పెంచుకున్నోళ్లంతా గ‌బ్బ‌ర్ సింగ్‌లు అయిపోర‌ని కామెంట్లు చేశారు. అయితే, తాజాగా ఉత్త‌మ్ గ‌డ్డంపై ఎంఐఎం ఎమ్మెల్యే బలాల భారీ సెటైర్లు వేశారు.

అసెంబ్లీలో ఆయ‌న మాట్లాడుతూ ఇంకా 10 ఏళ్ళు అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం అలానే ఉండాల‌ని ఆకాంక్షించారు. 10 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఉత్త‌మ్ గ‌డ్డం ఉగ్ర‌వాది ఒసామా బిన్ లాడెన్ గడ్డాన్ని మించిపోతదని ఎమ్మెల్యే బలాల ఎద్దేవా చేశారు.  తెలంగాణ పాలిట ఏపీ సీఎం చంద్రబాబు గబ్బర్ సింగ్ అని, తెలంగాణలోని ఏపీ ప్రజలు కూడా చంద్రబాబును నమ్మలేదన్నారు.

ఇప్పుడు ఏపీ నుంచి కూడా చంద్రబాబును గెటౌట్ చేస్తారని జోస్యం చెప్పారు. అయితే, కాంగ్రెస్ గెలిస్తేనే గడ్డం తీస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన స‌వాల్ ఆ పార్టీ గెల‌వ‌క‌పోవ‌డం వ‌ల్ల అమ‌లుకు నోచుకోలేదు. దీంతో వచ్చే 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాదనే భావంతో ఎంఐఎం ఎమ్మెల్యే బలాల సెటైర్ వేశార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English