కొంచెం జాగ్రత్తమ్మా ఆది.. ఇవి పాలిటిక్స్

కొంచెం జాగ్రత్తమ్మా ఆది.. ఇవి పాలిటిక్స్

జబర్దస్త్ కమెడియన్, జనసేన అధినేతకు వీరాభిమాని అయిన హైపర్ ఆది ప్రస్తుతం రాజకీయ వార్తల్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు.  ఒక పొలిటీషియన్ గా కాకుండా సభలు ఎక్కడ జరిగినా కూడా తన మాటలతో జనాలను జనసేన వైపు తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే రాజకీయాల్లో ఉహించని చేదు అనుభవాలు ఎదురవ్వడం సాధారణం. ఇప్పుడు ఆదిపై వైసిపి నేతలు టార్గెట్ పెంచారని టాక్ వస్తోంది.

రీసెంట్ గా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరులో జరిగిన జనసేన సభకు వెళ్లిన ఆధికి అక్కడ వైసిపి నేతల నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రసంగం మొదలెట్టాకముందే వైసిపి నేతలు ఆది ఎంట్రీ ఇవ్వగానే కారుపై రాళ్లతో దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం ఈ సమస్యలు ఎన్నికల వరకు తప్పవని ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని పదునైన స్పీచ్ తో అదరగొట్టేసాడు. అయితే పాలిటిక్స్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎప్పుడు ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టం. అసలే జబర్దస్త్.. కాంట్రవర్సీ న్యూస్ లు వెతుక్కోవడానికి విమర్శకులకు చాలాదారులు ఉన్నాయి. సాక్ష్యాత్తూ పవన్ కే కూడా వ్యక్తిగత విమర్శలు తప్పడం లేదు. రాజకీయాలు వేడెక్కుతున్న సమయంలో మాటల తూటాలు గురి తప్పితే మొదటికే మోసం వస్తుంది. మరి హైపర్ ఆది పవన్ రాజకీయాల్లో ఎంతవరకు ఉపయోగపడతాడో చూడాలి. కాకపోతే తనకు పర్సనల్ గా ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English