ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్‌...బాబుకు చెక్ పెట్టేందుకేనా?

ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్‌...బాబుకు చెక్ పెట్టేందుకేనా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కించేలా కేంద్రం అడుగులు వేస్తోందా? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దూకుడుకు ప్రజాస్వామ్య‌యుత రూపంలోనే చెక్ పెట్ట‌నుందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ద్వివేదిని నియమించిన నేపథ్యంలో వ్యూహాత్మకంగా గవర్నర్ నియామకంపై కేంద్రం వ్యవహరించనున్నట్లు తెలిసింది. త్వరలో ఏపీకి కొత్త గవర్న‌ర్‌ను నియ‌మించేందుకు కేంద్రం సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఏపీకి గవర్నర్ నియామకంపై కేంద్రం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా, రాష్ట్ర విభజన జరిగిన దాదాపు నాలుగున్నర సంవత్సరాల తరువాత ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో గవర్నర్‌ను నియమించనున్నట్లు స‌మాచారం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పదవీ కాలం చాలా కాలం క్రితమే ముగిసినప్పటికీ, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ ఆయనే రెండు రాష్ట్రాలకూ గవర్నర్‌గా కొనసాగుతారని కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. అయితే, ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టం, మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో, ఏపీకి ప్ర‌త్యేక గ‌వ‌ర్న‌ర్ నియామ‌కంపై కేంద్ర ప‌రిశీలిస్తున్న‌ట్లు చెప్తున్నారు. ఈ క్ర‌మంలో ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న కిరణ్‌బేడీని ఏపీ గవర్నర్‌గా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల నాటికి ఓ స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English