జగన్ రాజశ్యామల యాగం చేయించండి

జగన్ రాజశ్యామల యాగం చేయించండి

పూర్వం రాజులు ప్రజల క్షేమం కోసం రాజసూయా యాగం చేసేవారు. ఈ యాగం చేస్తే యుద్దంలో గెలుపు ఖయామని, ప్రజలు సుఖశాంతులతో ఉంటారని ఆ కాలంలో నమ్మేవారు. మరి ఇప్పుడు కాలం మారింది రాచరిక శకం ముగిసింది... రాజుల స్దానాలలో ముఖ్యమంత్రులు వచ్చారు.... అలాగే రాజసూయా యాగం బదులుగా రాజాశ్యామల యాగం చేస్తున్నారు. ఏ యాగమైన ప్రజల సుఖసంతోషాల కోసమే అని అంత నమ్ముతున్నారు. ఇదంతా ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి కాసింత భక్తి ఎక్కువే. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చండీ యాగం చేసారు. కొత్త సంవత్సరంలో  ఆయన రాజశ్యామాల యాగం చేసారు. రెండుసార్లు కూడా ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ఇదే నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడైన వైఎస్. జగన్మోహాన రెడ్డిని కూడా ఈ రాజశ్యామాల యాగం  చెయించమని సలహా ఇచ్చినట్లు సమాచారం.

ఈ సంవత్సరం ఫిబ్రవరీ 14వ తెదీన అమరావతిలో వైఎస్. జగన్మోహాన రెడ్డి ఇంటి గ్రుహప్రవేశం సంధర్భంగా ఈ కార్యక్రమం నిర్వాహించమని జగన్‌కు కెసీఆర్ సలహా ఇచ్చినట్లు సమాచారం. ఈ గ్రుహాప్రవేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూడా హాజారవుతున్నారు. అయితే జగన్ క్రైస్తవ మతానికిచెందినవారు కావడంతో ఈ కార్యక్రమం నిర్వహించాడానికి అభ్యతరం ఉంటే ఎవరైన సీనియర్ నాయకుడు చేత చేయిస్తే అంతా మంచే జరుగుతుందని, కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే జగన్ ఈ మధ్యనే సాంప్రాదాయ రీతిలో తిరుమల తిరపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ చర్య వలన అటు హిందువుల నుంచి గాని, క్రైస్తవ మతస్థుల నుంచి గాని విమర్శలు రాలేదు. అయినా ఇది దేవకార్యం కాబట్టి ఎటువంటి వివాదం రాదని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అన్నట్లు తెలుస్తోంది. జగన్మోహాన రెడ్డికి ప్రజాబలం దండిగా ఉంది కాబట్టి, దీనికి దైవబలం కూడా తోడైతే ఎదురుండదని కెసీఆర్ సలహా ఇచ్చినట్లు సమాచారం. ఈ యాగం చేయడం వలన ముఖ్యమంత్రి పీఠం దక్కడంతో పాటు, అధికారంలో ఉన్నన్నాళ్లు అనకున్నది సాధించగలరని అన్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర్రప్రదేశ్‌లోనూ, తెలంగానులోను రుత్వికులకు లోటు లేదని, ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయించగలరని కేసీఆర్ అన్నారటా..అయితే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇచ్చిన సలహా పాటించే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. జగన్ తాను నేరుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాను, తన పార్టీలో సీనియర్ హిందు నాయకుడు చేత ఈ రాజశ్యామాల యాగం చేయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English