ఇదీ గులాబి బాస్‌ మాయజాలం

ఇదీ గులాబి బాస్‌ మాయజాలం

తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయాలు ఓ పట్టాన ఎవరికి అర్దం కావు. ఆయన ఏం చేసిన దాని వెనుక పెద్ద వ్యూహమే ఉంటుందని రాజకీయ నాయకులతో పాటు విశ్లేషకులు కూడా చెప్తారు. తెలంగాణ ముందస్తు ఎన్నికలలో ఘన విజయం తర్వాత ముఖ్యమంత్రిగాను, పార్టీ అధినేతగాను కె. చంద్రశేఖర రావు తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుపట్టడం లేదు.  ఎన్నికల అనంతరం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తన కుమారుడు తారక రామారావు నియమించడం నుంచి స్పీకర్ ఎన్నిక, మంత్రి వర్గ విస్తరణ వంటి నిర్ణయాలను వ్యూహత్మకంగా తీసుకుంటున్నారు. తన సొంత జిల్ల మెదక్‌లో కూడా కేసీఆర్ వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారు. తన కుమారుడికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, మేనల్లుడు  హరీష్‌రావు నుంచి సమస్యలు ఎదురు కాకుండా పావులు కదుపుతున్నారు. మెదక్్ జిల్లాలోని సిద్దిపేటలో తన అనుంగు అనుచరుడు ఎం. శ్రీనివాస్‌ రెడ్డికి పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మెన్ పదవి ఇచ్చారు. మంత్రి వర్గ విస్తరణ చేయకుండానే ఈ కీలక పదవిని కట్టబెట్టడం హరీష్‌రావుకు చెక్‌ పెట్టడమే అంటున్నారు.

ఇక తన నియోజకవర్గం గజ్వేల్‌లో తనపై పోటీ చేసి మూడు సార్లు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓంటేలు ప్రతాప్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఇది ఎవరూ ఊహించని పరిణామం. జాతీయ రాజకీయాలలో చురుకుగా వ్యవహరించాలనుకుంటున్న కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలో తనకు పోటీ లేకుండా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఓంటేలును పార్టీలో చేర్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇన్నాళ్లు గజ్వేల్ నియోజకవర్గ బాధ్యతలు హరీష్‌రావు చూసారు. ఓంటేలు ప్రతాప్‌ రెడ్డి టిఆర్ఎస్‌లో చేరాడంతో ఆ నియోజకవర్గంలో పోటీయే లేకుండ పోయింది. ఇక గజ్వేల్ బాధ్యతలను హరీష్‌రావుకు కాకుండా ఓంటేలు ప్రతాప్‌ రెడ్డికి అప్పగిస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది. అంటే హరీష్‌రావుకు చెక్‌ పెట్టేందుకు సిద్దిపేటలో శ్రీనివాస్‌ రెడ్డిని, గజ్వేలో ప్రతాప్‌ రెడ్డిని రంగంలోకి దించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ తరహా మాయజలం గులాబి బాస్‌కు తప్ప మరెవరికి సాధ్యం కాదని రాజకీయ పరిశీలకుల అంచన.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English