చేర‌క‌ముందే..సంచ‌లన‌ వ్యాఖ్య‌లు చేసిన వంటేరు

చేర‌క‌ముందే..సంచ‌లన‌ వ్యాఖ్య‌లు చేసిన వంటేరు

అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున ఆయనపై పోటీచేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి ఊహించ‌ని రీతిలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. సీఎం కేసీఆర్ సమక్షంలో వంటేరు గులాబీ పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రచారాన్ని టీఆర్ఎస్ నేతలు ఖండించించారు. అయితే, ఈ వార్తలు నిజ‌మ‌య్యాయి. ఆయ‌న టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ వంటేరు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఇవాళ మీడియాతో మాట్లాడిన వంటేరు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తనకు బాస్ అని ప్రకటించారు. `నా పోరాటాలు సరికాదు...కేసీఆరే నాకు బాస్.. ప్రజలంతా కేసీఆర్‌తో ఉన్నారు.. కాబట్టే నేను టీఆర్ఎస్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నా``అని వెల్లడించారు. పదవులు, డబ్బుల కోసం తాను టీఆర్ఎస్‌లో చేరడం లేదని స్పష్టం చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి... తాను ఏదో ఒక రోజు గజ్వేల్‌లో గెలవాలనే రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు.

ఇదిలాఉండ‌గా, గత ఎన్నికల్లో కేసీఆర్‌పై పోటీచేసిన వంటేరు ప్రతాపరెడ్డి ఓడిస్తానని సవాల్ చేసిన‌ప్ప‌టికీ...ఓటమి పాల‌య్యారు. కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి కాగా భవిష్యత్‌ రాజకీయాలు, వ్యక్తిగత ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గులాబీకండువా కప్పుకోవాలని ప్రతాప్‌రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జ‌రుగుతోంది. గజ్వేల్‌ అభివృద్దికోసమే తాను పార్టీమారుతున్నట్లు ప్రకటించినా ప్రతాపరెడ్డి రాజకీయభవిష్యత్‌పై కేసీఆర్‌ భరోసానిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయ‌న‌కు త్వ‌ర‌లో ఎమ్మెల్సీ సీటు ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English