జ‌గ‌న్‌.. కేటీఆర్ భేటీ వెనుక మ‌రొక‌రు?

జ‌గ‌న్‌.. కేటీఆర్ భేటీ వెనుక మ‌రొక‌రు?

ముంద‌స్తు ప్లానింగ్ ఏ మాత్రం లేకుండా.. ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్‌.. టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల మ‌ధ్య భేటీ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. పండ‌గ వేళ‌.. మాంచి జోష్ లో సంబ‌రాలకు భిన్నంగా చోటు చేసుకున్న ఈ ప‌రిణామంతో.. తెలుగు త‌మ్ముళ్లు అలెర్ట్ అయ్యారు. మైకుల ముందుకు వ‌చ్చారు.

ఈ ఇరువురి నేత‌ల మ‌ధ్య భేటీ గుట్టు విప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఏపీలో టీడీపీని దెబ్బ తీసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నార‌ని.. అందులోభాగంగానే తాజా భేటీ అని వ్యాఖ్యానించారు. జ‌గన్.. కేటీఆర్ భేటీ వెనుక మోడీ ఉన్న‌ట్లుగా టీడీపీ త‌మ్ముళ్లు బొండా ఉమ‌.. బుద్దా వెంక‌న్న‌లు ఆరోపించారు. బీజేపీ డైరెక్ష‌న్ లోనే కేసీఆర్ ప‌ని చేస్తున్నారు. ఇక‌.. కేసీఆర్ డైరెక్ష‌న్ లో జ‌గ‌న్ ప‌ని చేస్తున్న‌ట్లు చెప్పారు.

ముసుగు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని.. దొంగ రాజ‌కీయాల్ని చేస్తూ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అన్న మాట‌ల్ని కేసీఆర్ చెబుతున్నార‌ని.. అస‌లు అలాంటి ఫ్రంట్ ఏదీ లేద‌న్నారు. మోడీనే కేసీఆర్ చేత ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పెట్టించార‌న్నారు. తాజా భేటీతో కేసీఆర్‌.. జ‌గ‌న్ ల మ‌ధ్య చీక‌టి ఒప్పందం బ‌య‌ట‌ప‌డింద‌న్నారు. చంద్ర‌బాబును దెబ్బ తీయ‌టానికే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో కుట్ర‌లు చేస్తున్న‌ట్లుగా ఆరోపించారు.

ఎవ‌రెన్ని కూట‌మిలు క‌ట్టినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ 150 సీట్ల‌లో విజ‌యం సాధించ‌నుంద‌న్న ధీమాను వ్య‌క్తం చేశారు తెలుగు త‌మ్ముళ్లు. జ‌గ‌న్‌.. కేటీఆర్ ల మ‌ధ్య భేటీ వెనుక మోడీ ఉన్నార‌ని.. ఆయ‌నే కేసీఆర్ డైరెక్ష‌న్ లో ఈ వ్య‌వ‌హారాన్ని చేస్తున్న‌ట్లుగా మండిప‌డుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English