ర‌ఘువీరా శ‌పథం...ఏపీలోకి అడుగుపెట్ట‌గల‌రా?

ర‌ఘువీరా శ‌పథం...ఏపీలోకి అడుగుపెట్ట‌గల‌రా?

ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి భారీ శ‌పథం చేశారు. రెండు కీల‌కమైన అంశాలు, ఒకింత క‌ష్టసాధ్య‌మైన పాయింట్ల గురించి ఆయ‌న కీల‌క స‌వాల్ విసిరారు. ఈరోజు అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక ఏపీకి ప్రత్యేక హోదా అమలుచేసి తీరుతామని స్పష్టం చేశారు.  దీని ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందని, ఒకవేళ అమలు చేయలేకపోతే నా జీవితంలో శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టనని శపథం చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తాను రాష్ట్రంలో అడుగుపెట్టనని తెలిపారు.

2019లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలనేదే తమ లక్ష్యమని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. హోదా రావాలంటే రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలన్నారు. ``రాహుల్‌గాంధీ ప్ర‌ధాని పీఠం ఎక్కిన త‌ర్వాత నేను హోదా తెస్తా. తేలేకపోతే, నా ఊర్లో కూడా అడుగు పెట్టను. నా ఇల్లు, ఆస్తులు, అన్నీ ఇక్కడే ఉన్నాయి. 62 ఏళ్లుగా అక్కడే జీవిస్తున్నాను` అని రఘువీరా రెడ్డి తెలిపారు.  కాగా, ఇటీవ‌ల రాహుల్‌తో జ‌రిగిన స‌మావేశం వివ‌రాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరించాల్సిన రాజకీయ  విధానంపై రాహుల్‌తో లోతుగా చర్చించినట్టు చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి నేతలతో, పార్టీ సీనియర్లతో సేకరించిన అభిప్రాయాలను  రాహుల్ ముందు పెట్టామన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ నిర్ణయాత్మక శక్తిగా ఉంటుందని రఘువీరారెడ్డి  తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఏ విధంగా ముందుకెళ్తుందో, ఏ పార్టీలతో పొత్తులు ఉంటాయనేది వారం రోజుల్లో తెలుస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు చెప్పారు. పొత్తులపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని మరోసారి ఉద్ఘాటించారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులు కూడా సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ర‌ఘువీరా శ‌పథంగా బాగానే ఉన్ప‌ప్ప‌టికీ...నిజంగానే కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత హోదా అమ‌లు చేస్తుందా? అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English