ఇవాంకా ట్రంప్‌...వ‌రల్డ్ బ్యాంక్ అధ్య‌క్షురాలు!

ఇవాంకా ట్రంప్‌...వ‌రల్డ్ బ్యాంక్ అధ్య‌క్షురాలు!

ఓవైపు అగ్ర‌రాజ్యం అమెరికాలో ప్ర‌భుత్వం ష‌ట్ డౌన్ అవ‌డంతో హాహాకారాలు చెల‌రేగుతుండ‌గా, మ‌రోవైపు ఆ దేశ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకోవ‌డం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్రపంచ బ్యాంకు అధ్య‌క్షుడిగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్  ట్రంప్ త‌నయ ఇవాంకా ట్రంఫ్ బాధ్య‌త‌లు స్వీక‌రించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ మేరకు తాజాగా జ‌రిగిన ప‌రిణామాల‌ను పేర్కొంటు ప‌లువురు పేర్కొంటున్నారు.

వివ‌రాల్లోకి వెళితే... ప్రపంచ బ్యాంకు అధ్య‌క్షుడు జిమ్ యాంగ్ కిమ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రెండవ సారి అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌డుతున్న ఆయ‌న‌కు ఇంకా మూడేళ్ల స‌ర్వీస్ ఉంది. కానీ వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ హోదా నుంచి త‌ప్పుకోనున్న‌ట్లు ఆయ‌న సోమ‌వారం చెప్పారు. దీంతో ఆ అధ్య‌క్ష రేసు కోసం కొంద‌రి పేర్లు వినిపిస్తున్నాయి. యూఎన్ అంబాసిడ‌ర్ నిక్కీ హ‌లే, అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కూడా అమెరికా అభ్య‌ర్థులుగా వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ రేసులో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఇద్ద‌రి పేర్ల‌తో పాటు మ‌రికొంత మంది పేర్ల‌కు ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌హిళ వ్యాపార‌వేత్త‌ల సాధికార‌త కోసం 2017లో ఇవాంకా ట్రంప్ భారీగా నిధులు సేక‌రించారు. సుమారు వంద కోట్ల డాల‌ర్ల నిధుల‌ను ఆమె సేక‌రించి అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నారు. దీంతో ఇవాంకా కూడా వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ నామినేష‌న్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. వ‌ర‌ల్డ్ బ్యాంక్‌లో ఎక్కువ శాతం షేర్లు అమెరికావే. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత ఏర్పాటు అయిన ఆ బ్యాంక్‌కు అమెరికా ప్ర‌తిపాదించిన వ్య‌క్తులే అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టారు. వ‌చ్చే నెల నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ఉంటుంద‌ని, ఏప్రిల్‌లో వ‌ర‌ల్డ్ బ్యాంక్ నూత‌న అధ్య‌క్షుడిని ప్ర‌క‌టిస్తారు. అయితే, ఇందులో ఇవాంక ట్రంప్ పేరును ప్ర‌తిపాదిస్తార‌ని స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English