మోడీకి ఇంగ్లిష్ మాట్లాడ‌ట‌మే రాదు..ఆయ‌న‌వ‌న్నీ చెత్త రాజ‌కీయాలు

మోడీకి ఇంగ్లిష్ మాట్లాడ‌ట‌మే రాదు..ఆయ‌న‌వ‌న్నీ చెత్త రాజ‌కీయాలు

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ మోడీపై వ్యంగ్యంగా అటాక్ చేశారు. మోడీకి గట్టిగా ఒక్క వాక్యం కూడా ఇంగ్లీష్ లో మాట్లాడడం చేతకాదని అన్నారు. ‘మోడీకి బొత్తిగా ఇంగ్లీష్ మాట్లాడరాదు. అందుకే ఆయన పదేపదే టెలీ ప్రింటర్ వైపు చూస్తుంటారు. ఆయన బాగా మాట్లాడగలిగితే అలా చూడాల్సిన పనేంటి?’ అని అన్నారు. మోడీ పథకాలతో రాజకీయం చేస్తున్నారని, పశ్చిమ బెంగాల్ లోని ప్రతి ఓటరుకు మోడీ తన ఫోటోతో లెటర్లు పంపుతున్నారని ఆమె ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ నుంచి తాము వైదొలుగుతున్నట్లు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఆరోగ్య పథకం పేరుతో కేంద్ర ప్రభుత్వం చెత్త రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. గురువారం పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకం పేరుతో పశ్చిమబెంగాల్‌లోని ప్రతి ఇంటికి మోదీ ప్రభుత్వం లేఖలు పంపుతున్నది. ఆ లేఖలపై మోదీ, బీజేపీ ఎన్నికల గుర్తు కమలం ఫొటోలు ఉన్నాయి. ఓ ఆరోగ్య పథకం పేరుతో ఇలాంటి చెత్త రాజకీయాలు చేయడం సరికాదు అని పేర్కొన్నారు. ఆయుష్మాన్ ప్రాజెక్టును మొత్తం కేంద్రం ఖర్చుతోనే అమలు చేయాలన్నారు. పథకం మొత్తం క్రెడిట్ తనకే దక్కాలన్నట్లు మోడీ ప్రచారం చేస్తుంటే రాష్ట్రాలు 40 శాతం ఖర్చు ఎందుకు భరించాలని ప్రశ్నించారు. తమ రాష్ట్రం రూపాయి కూడా ఈ పథకానికి ఇవ్వదని చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English