డేరా బాబా దోషే...మ‌రో సంచ‌ల‌న తీర్పు

డేరా బాబా దోషే...మ‌రో సంచ‌ల‌న తీర్పు

అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు  మ‌రో షాక్ త‌గిలింది. తన దగ్గర శిష్యులుగా చేరిన ఆడ భక్తులను రేప్ చేసిన కేసులో గతంలో అరెస్టయిన డేరా బాబా అలియాస్ రామ్ రహీమ్ సింగ్ మరో కేసులోనూ దోషిగా తేలాడు. ఇప్పటికే రేప్ కేసులో 20ఏళ్ల శిక్ష పడి జైలు జీవితం అనుభవిస్తున్నాడు డేరా బాబా. ఓ జర్నలిస్టును చంపిన కేసులోనూ అతడు దోషి అని పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ఈ కేసులో అతడితో పాటు మరో ముగ్గురిని కూడా హంతకులుగా తేల్చింది. అయితే శిక్ష ఎంతకాలం అన్న విషయంపై జనవరి 17న తీర్పు రానుంది.

2002లో రామచంద్ర ఛత్రపతి అనే జర్నలిస్టు ఎంతో డేర్ చేసి డేరా బాబా తన ఆశ్రమంలో మహిళలపై పాల్పడుతున్న అరాచకాలపై వివరాలు సేకరించి ప్రతికలో ప్రచురించారు. దీంతో రామచంద్రను డేరా బాబా కాల్చి చంపాడు. 2003లో దీనిపై కేసు పెట్టగా.. 2006లో సీబీఐ హాండోవర్ చేసుకుంది. ఇంతకాలం విచారణ తర్వాత కోర్టు డేరా బాబాతో పాటు మరో ముగ్గురిని హంతకులుగా తేల్చింది. కాగా, గతంలో రేప్ కేసులో అతడిని అరెస్టు చేసిన సమయంలో హర్యానా, పంజాబ్ లలో అల్లర్లు జరిగి 40 మంది చనిపోయారు. దీంతో తాజా తీర్పు తర్వాత పోలీసులు హర్యానాలో పోలీసులు అలర్ట్ అయ్యారు. భ‌ద్ర‌తా ఏర్పాట్లను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English