సినిమాకు డబ్బులివ్వలేదు.. తండ్రిని తగలబెట్టేశాడు

సినిమాకు డబ్బులివ్వలేదు.. తండ్రిని తగలబెట్టేశాడు

సినిమాల పిచ్చి ముదిరితే.. హీరోల మీద అభిమానం హద్దులు దాటితే ఎంత ప్రమాదమో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. తమిళనాడులో సినిమా మోజుతో ఒక కుర్రాడు దారుణానికి పాల్పడ్డాడు. వేలూరు జిల్లా కలింజూర్ ప్రాంతానికి చెందిన అజిత్ కుమార్.. తమిళ స్టార్ అజిత్‌కు అభిమాని. సంక్రాంతి కానుకగా గురువారం అజిత్ సినిమా ‘విశ్వాసం’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసేందుకు డబ్బులు ఇవ్వాలని అతను తన తండ్రి పాండియన్‌ను ఒత్తిడి చేశాడు. రోజు వారీ కూలీ అయిన పాండియన్ అందుకు నిరాకరించాడు. దీంతో పాండియన్ మీద అతడికి కోపం వచ్చింది. కాసేపటి తర్వాత కిరోసిన్ డబ్బాతో వచ్చి పాండియన్ ఒంటిమీద పోసి నిప్పంటించేశాడు.

45 ఏళ్ల పాండియన్ మంటల్లో కాలిపోతుండగా.. చుట్టుపక్కన వాళ్లు వచ్చి ఆర్పి.. అతడిని ఆసుపత్రికి తరలించారు. పాండియన్ తన భార్యతో గొడవపడి కొంత కాలంలో వేరే చోట ఒంటరిగా ఉంటున్నాడు. ముందు తన తల్లిని డబ్బులడిగి ఆమె లేదనడంతో తండ్రిని వెతుక్కుంటూ వెళ్లాడట అజిత్. కొన్ని రోజులుగా రోడ్డు పక్కన ఒక టెంట్ వేసుకుని అక్కడే ఉంటున్నాడట పాండియన్. అజిత్ కూడా కూలీగానే పని చేస్తున్నాడు. తన హీరో సినిమాను తొలి రోజే చూడాలన్న కోరిక అతడితో ఇంత పని చేయించింది. పోలీసులు అజిత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. తమిళనాట స్టార్ హీరోల పట్ల ఆరాధ్య భావం కొంచెం ఎక్కవే. తొలిరోజే సినిమా చూడాలని అక్కడి అభిమానులు తహతహలాడిపోతుంటారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English