కేసీఆర్ కొత్త స్కెచ్‌..ఎంపీగా సీనియ‌ర్ ఐఏఎస్‌

కేసీఆర్ కొత్త స్కెచ్‌..ఎంపీగా సీనియ‌ర్ ఐఏఎస్‌

సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు సుప‌రిచిత చిరునామా అయిన గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారా? త‌ను అత్యంత గౌర‌వించే ఓ సీనియ‌ర్ ఐఎఎస్‌ను ఆయ‌న ఢిల్లీ పంపించ‌నున్నార‌? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న మాజీ సీఎస్‌ డాక్టర్‌ రాజీవ్‌శర్మను పార్లమెంటు బరిలో దింపేందుకు సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నారని టీఆర్ఎస్ ముఖ్యుల‌ను ఉటంకిస్తూ మీడియా సర్కిల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. సామాజిక సమీకరణాలతోపాటు విద్యాధికులు అధికంగా ఉండే మల్కాజిగిరి నుంచి రాజీవ్‌ శర్మను పోటీకి దించితే గెలుపు సునాయసమవుతుందని సీఎం భావిస్తున్నట్టు వినికిడి.

గత ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి.. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో అక్కడి నుంచి రాజీవ్‌శర్మను బరిలోకి దింపేందుకు కేసీఆర్‌ యోచిస్తున్నారు. ఇదే సీటుపై కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి కూడా ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఉప్పల్‌ ఎమ్మెల్యే సీటును ఆశించి భంగపడ్డ హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మెహన్‌ సైతం మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ద్వారా టికెట్‌ దక్కించుకోవచ్చన్న ఆశతో ఆయన ఉన్నారు. అయితే, గులాబీ ద‌ళ‌ప‌తి ఓకే చేస్తే రాజీవ్ శ‌ర్మ‌కే టికెట్ ద‌క్క‌నుంద‌ని అంటున్నారు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం,రాజీవ్ శ‌ర్మ సామాజికవ‌ర్గానికి చెందిన వారు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అధికంగా ఉండ‌టం.

ఇంత‌కీ, గులాబీ ద‌ళ‌ప‌తి సీనియ‌ర్ ఐఏఎస్‌ను ఎందుకు రాజకీయ నాయకుడి అవతారం ఎత్తించ‌బోతున్నారు అనేక‌దా అస‌లు సందేహం? సీనియర్‌ ఐఏఎస్‌ అయిన ఆయన శ‌ర్మ  గతంలో కేంద్ర ప్రభుత్వంలో పనిచేశారు. ఆయనకు ఢిల్లీలో ఉన్న పరిచయాలు.. పార్టీకి బాగా ఉపయోగపడతాయని కేసీఆర్‌ భావిస్తున్నారు. అందుకే కీల‌క‌మైన ముఖ్య స‌ల‌హాదారు ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు.  ఇప్పుడు అదే ప‌రిచ‌యాల‌తో మ‌రోమారు చ‌ట్ట‌స‌భ‌ల్లో శ‌ర్మ త‌ర‌ఫున తెలంగాణ గ‌ళం వినిపించాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English